Mobile Popup Ad
Mobile Popup Ad

కీలక చర్చలు జరుగుతుంటే.. ఎమ్మెల్యేలకు ఆటల పోటీలా? : కేటీఆర్

కలం, వెబ్ డెస్క్ : అసెంబ్లీలో కీలక పద్దులపై చర్చలు జరగుతుంటే ఎమ్మెల్యేలకు ఆటలు పోటీలు నిర్వహిస్తారా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం అసెంబ్లీ లాబీలో ఆయన మీడియాతో చిట్ చాట్ చేశారు. సీరియస్ గా సమావేశాలు జరుగుతన్న వేళ ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వడం ఏంటని విమర్శించారు. ఈ విషయంపై మంత్రి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్తే ఎలాంటి సమాధానం లేదన్నారు. ఇది ప్రజా సమస్యలపై ప్రభుత్వం బాధ్యతారాహిత్యాన్ని చూపెడుతోందని ఆరోపించారు. ఇరిగేషన్ వంటి కీలక అంశాలపై లోతైన చర్చ జరగాల్సి ఉందని.. అయితే ప్రభుత్వం మాత్రం పద్దులపై చర్చను త్వరగా ముగించాలని చూస్తోందని ఆయన (KTR) విమర్శించారు.

కీలక విషయాలపై చర్చించాల్సిన వేళ ఎమ్మెల్యేలు గ్రౌండ్ లో ఆటలు ఆడితే ప్రజలు ఏమనుకుంటారన్నారు. కాగా, ఈ నెల 28, 29 తేదీల్లో ప్రజాప్రతినిధులకు క్రీడా పోటీలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేసిన కేటీఆర్. అసెంబ్లీ సమయాన్ని ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించకుండా ఇలాంటి కార్యక్రమాలతో కాలయాపన చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకనే ఈ ఆటల పోటీలు నిర్వహించాలని చూస్తోందని కేటీఆర్ విమర్శించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>