Mobile Popup Ad
Mobile Popup Ad

ఐపీఎల్‌-2026 రెండో షెడ్యూల్‌ విడుదల

కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్‌-2026 (IPL 2026) రెండో షెడ్యూల్‌ విడుదలైంది.ఈ మేరకు ఐపీఎల్‌-2026 రెండో దశ (Phase 2) షెడ్యూల్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తాజాగా రిలీజ్ చేసింది. రెండో షెడ్యూల్‌లో 12 వేదికల్లో 50 ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఏప్రిల్ 13 నుంచి మే 24 వరకు ఈ మ్యాచ్ లు జరగనుండగా.. రెండో విడతలో భాగంగా 8 రోజుల పాటు ఒక్కో రోజు రెండు మ్యాచ్‌లు (డబుల్ హెడర్స్) నిర్వహిస్తారు.

రెండో షెడ్యూల్ ను ఏప్రిల్ 13న హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగే పోరుతో షురూ అవుతోంది. మే 24న లీగ్ దశ ముగింపు సందర్భంగా రెండు మ్యాచ్‌లు ఉన్నాయి. మధ్యాహ్నం ముంబైలో ముంబై ఇండియన్స్ vs రాజస్థాన్ రాయల్స్, రాత్రి కోల్‌కతాలో కేకేఆర్ vs ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య పోరుతో లీగ్ దశ ముగుస్తుంది. ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ ల షెడ్యూల్ అలాగే వేదికలు త్వరలోనే ప్రకటించే అవకాశం ఉందని బీసీసీఐ పేర్కొంది.

ఇప్పటికే ఐపీఎల్ (IPL – 2026) 19వ సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లకు సంబంధించిన తొలి దశ షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఆ షెడ్యూల్ ప్రకారం మార్చి 28 నుంచి ఏప్రిల్ 12 వరకు తొలి విడత మ్యాచ్‌లు జరగనున్నాయి. మార్చి 28న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య జరిగే పోరుతో ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.

Read Also: సమగ్ర అభివృద్ధి అనంతరం మారనున్న భద్రాచలం రూపురేఖలు

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>