భద్రాచలంలో శివనామస్మరణ.. గోదావరిలో దీపాల కాంతులు!

కలం, ఖమ్మం బ్యూరో: పవిత్ర కార్తీక మాసం ప్రారంభం కావడంతో భద్రాచలం (Bhadrachalam) పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతోంది. మంగళవారం తొలి రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో గోదావరి తీరానికి తరలివచ్చి పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక మాసంలో దీపారాధనకు ఉన్న విశిష్టతరీత్యా.. భక్తులు నదిలో దీపాలు వదులుతూ, భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గోదావరి తీరమంతా దీపాల కాంతులతో మనోహరంగా మారింది.​

మరోవైపు, శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం ఉపాలయమైన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి ఆలయం (శివాలయం) శివనామస్మరణతో మార్మోగింది. కార్తీక మాస వేడుకల్లో భాగంగా శివాలయంలోనూ ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. తొలి రోజే గోదావరి తీరం, శివాలయం భక్తులతో కిటకిటలాడటంతో భద్రాచలంలో పర్వదిన వాతావరణం నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>