కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో నేరాల కట్టడికి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని అధికారులను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు (SP Rohit Raju) ఆదేశించారు. పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో మంగళవారం నిర్వహించిన నెలవారీ నేర సమీక్ష సమావేశంలో ఆయన పోలీసు అధికారులతో మాట్లాడారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు చేపట్టి నేరస్తులకు శిక్ష పడేలా చూడాలని, హత్య కేసుల దర్యాప్తులో ఎలాంటి జాప్యం సహించేది లేదని హెచ్చరించారు.
పెండింగ్‌లో ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ల (ఎన్బీడబ్ల్యూ) అమలుపై ప్రత్యేక దృష్టిసారించి నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచాలని ఆదేశించారు. ఎన్డీపీఎస్ కేసుల్లో నిందితుల ఆర్థిక మూలాలను గుర్తించి అక్రమ ఆస్తులను జప్తు చేయాలని, గంజాయి అక్రమ రవాణా, వినియోగంపై నిఘా పెంచి వినియోగదారులను డి-అడిక్షన్ సెంటర్లకు తరలించాలని సూచించారు.
మహిళలు, బాలికల భద్రతకు ప్రాధాన్యతనిస్తూ భరోసా కేంద్రం, షీ-టీమ్స్ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఎస్పీ సూచించారు. అలాగే సీసీటీవీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేసి డైల్-112 ఫిర్యాదులపై తక్షణ స్పందన అందించాలని తెలిపారు. ఈ సమావేశంలో కొత్తగూడెం, పాల్వంచ, మణుగూరు, ఇల్లందు, భద్రాచలం డీఎస్పీలతో పాటు డీసీఆర్బీ డీఎస్పీ, జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు, పోలీసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

