నిర్మల్‌ను కరువు జిల్లాగా ప్రకటించాలి : సిపిఐ

కలం, నిర్మల్: నిర్మల్ జిల్లాలో నెలకొన్న తీవ్ర కరువు పరిస్థితుల దృష్ట్యా తక్షణమే కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని సిపిఐ పార్టీ నాయకులు మంగళవారం జిల్లా అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం (Drought Relief Petition) అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కడెం ప్రాజెక్టు నుంచి డిసెంబర్ వరకు జన్నారం, దస్తూరాబాద్ మండలాల రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించాలని కోరారు. పంట నష్టపోయిన రైతులకు వరి పంటకు ఎకరాకు రూ.30 వేలు, పత్తి, మిర్చి పంటలకు రూ.50 వేలు, ఇతర పంటలకు రూ.20 వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

కౌలు రైతులను గుర్తించి నష్టపరిహారం అందించడంతో పాటు విద్యుత్ కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని కోరారు. తాగునీటి సమస్య పరిష్కారానికి గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు కేటాయించాలని, పశువులకు మేత అందించాలని, ఉపాధి హామీ పనిదినాలు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి భూక్యా రమేష్, శంకర్, గంగయ్య, ఎల్లమ్మ, పుండలిక్, కుమార్, అంజన్న, అనంతరావు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>