కలం, వెబ్ డెస్క్ : ప్రస్తుతం చాలామంది ఉద్యోగులు ఆఫీస్ పనివేళలు ముగిసిన కూడా వర్క్‌కు సంబంధించిన మెయిల్స్, ఫోన్స్ అటెండ్ చేయాల్సి వస్తుంది. దీంతో ఉద్యోగుల పర్సనల్ లైఫ్‌లో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో పనివేళలు ముగిసాక ఆఫీస్ నుంచి వచ్చే కాల్స్ లేదా ఈ-మెయిల్స్ ను ఉద్యోగులు స్వీకరించొద్దు అనే హక్కును కల్పించాలని పార్లమెంట్(Parliament) లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టారు.
Parliament | ఎన్సీపీ ఎంపీ సుప్రీయా సులే ‘రైట్ టూ డిస్కనెక్ట్ బిల్లు-2025’ (Right to disconnect bill-2025) ను ప్రవేశపెట్టారు. ఈ బిల్లులో ఉద్యోగులకు సంక్షేమ సంస్థను ఏర్పాటు చేయడం కూడా పొందుపరిచారు. ప్రతి ఉద్యోగి ఆఫీస్ పనివేళల తరువాత, సెలవు రోజుల్లో ఆఫీస్ నుంచి లేదా పనికి సంబంధించిన ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ తిరస్కరించేందుకు హక్కు కలిగి ఉండాలని ప్రవేటు బిల్లులో ప్రతిపాదించారు. అలాగే, కాంగ్రెస్ ఎంపీ కడియం కావ్య మహిళ రుతుస్రావ బిల్లు-2024(Menstrual Benefits Bill-2024) ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా పనిచేసే స్థలాల్లో మహిళలకు సంబంధించి సౌకర్యాలతో పాటు వారికి మద్దతుగా ఉండాలని ఈ బిల్లులో పొందుపర్చారు.
తమిళనాడు విద్యార్థులకు నీట్ ఎగ్జామ్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్.. దేశంలో మరణశిక్షను రద్దు చేయాలని డీఎంకే ఎంపీ కనిమోజీ కరుణానిధి ప్రైవేట్ బిల్లులను ప్రవేశపెట్టారు. జర్నలిస్టులను హింస నుంచి రక్షించడానికి స్వతంత్ర ఎంపీ జర్నలిస్ట్(ప్రివెన్షన్ ఆఫ్ వయొలెన్స్ అండ్ ప్రొటెక్షన్)-2024 బిల్లును ప్రవేశపెట్టారు.
Read Also: గుజరాత్ టు తెలంగాణా.. 22 ఏండ్ల ప్రస్థానం
Follow Us On : Facebook


