కలం, వెబ్ డెస్క్: విమాన ప్రయాణికులను ఇండిగో సంక్షోభం అవస్థలపాలు చేస్తున్నవేళ కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. సమస్యకు ఇండిగో యాజమాన్యమే కారణమన్నారు. ఆ సంస్థ యాజమాన్యం నిర్వహణ సరిగా లేకపోవడంతోనే సమస్య తలెత్తిందని చెప్పారు. దీనిపై విచారణకు ఆదేశించామని, బాధ్యులు మూల్యం చెల్లించాల్సిదేనని స్పష్టం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన ఈ విధంగా స్పందించారు.
“పైలెట్ల విధులు, విశ్రాంతి, విమానాల రాకపోకల షెడ్యూళ్లపై డీజీసీఏ రూపొందించిన ఫ్టైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్ (ఎఫ్ డీటీఎల్) నిబంధనలు నవంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చాయి. వీటిని ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్ సహా తదితర అన్ని విమానయాన సంస్థలు సక్రమంగా అమలు చేస్తున్నాయి. వాటిలో ఎలాంటి ఇబ్బందీ తలెత్తలేదు. ఇండిగో(Indigo)లో మాత్రమే సమస్య వచ్చింది. దీనికి కారణం సంస్థ బాధ్యతారాహిత్యమే. ఎఫ్ డీటీఎల్ నిబంధనలను అమలు చేయడంలో సరిగా వ్యవహరించకపోవడం వల్ల ప్రస్తుత సంక్షోభం తలెత్తింది. ఇండిగోలో మాత్రమే ఈ సమస్య తలెత్తినప్పటికీ మూల కారణం కనుక్కోవడానిక కమిటీ నియమించాం. దీనికి బాధ్యులు మూల్యం చెల్లించాల్సిందే” అని రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) స్పష్టం చేశారు. కాగా, ఇండిగో సమస్య పరిష్కరించడానికి డీజీసీఏ 48 గంటల సమయాన్ని ఇచ్చింది. మరోవైపు ఇండిగో సంక్షోభంపై సుప్రీంకోర్టులో పిటిషన్ సైతం దాఖలైంది.
Read Also: రోడ్ టెర్రర్: గంటకు 20.. రోజుకు 485 మంది!
Follow Us On : Facebook


