కలం, వెబ్ డెస్క్: ఇండియాకు తిరుగులేని పవర్ ఒచ్చింది. ప్రంపచంలోనే మోస్ట్ పవర్ ఫుల్ S-500 ఇండియాకు ఇవ్వడానికి పుతిన్(Putin) ఒప్పుకున్నారు. ఇందిరాగాంధీ టైమ్ నుంచి మోడీ దాకా ఇండియాకు రష్యా ఒక రక్షణగా ఉంటూ వస్తోంది. 1971లో పాకిస్థాన్ చొరబాటుదారుల విషయంలో యుద్ధం వస్తే.. అమెరికా, బ్రిటన్ పాకిస్థాన్ పక్కన నిలబడ్డాయి. ఇండియా మీద యుద్ధం ప్రకటించాయి. అప్పుడు ఏ దేశం ఇండియాకు సాయం చేయలేదు. కానీ రష్యా నేనున్నానంటూ అండగా నిలబడింది. రష్యా రాకతో అమెరికా, బ్రిటన్ ఇండియా మీద దాడులు చేయలేదు. అందుకే అందరు ప్రధానులు రష్యాతోనే దోస్తీ చేస్తున్నారు. రష్యాతో దోస్తీ చేయొద్దని అమెరికా ఎంత బెదిరిస్తున్నా.. ట్రంప్ టారిఫ్ లు వేస్తున్నా సరే మోడీ వెనక్కు తగ్గలేదు. వెస్ట్ దేశాలన్నీ ఒత్తిడి చేస్తున్నా పట్టించుకోకుండా రష్యాతోనే మా ప్రయాణం అన్నారు.
ఎందుకంటే ఆపదలో మనకు అండగా నిలబడే నిజమైన మిత్ర దేశం రష్యానే. అందుకు ప్రతిగా నిన్న ఇండియాకు వచ్చిన పుతిన్((Putin)) ఇండియాకు S-500 ఇస్తామని ఒప్పందంపై సంతకం చేశారు. ఆపరేషన్ సింధూర్ టైమ్ లో S-400 గురించే అంతా మాట్లాడుకున్నారు. దాన్ని ఇచ్చింది రష్యానే. శత్రువుల విమానాలు, డ్రోన్లు, బాంబులు ఏవీ కూడా ఇండియా బార్డర్ దాటి రానివ్వలేదు ఈ వెపన్. ఇప్పుడు అంతకు పది రెట్ల పవర్ ఫుల్ S-500 వస్తే ఇండియాకు తిరుగే ఉండదు. ఇది భూమి నుంచి 75 కిలోమీటర్ల దూరంలో అంటే అంతరిక్షంలో ఏమైనా ఉన్నా సరే పేల్చి పారేస్తుంది. ఇండియా గగనతలంలోకి దేన్నీ రానివ్వదు. అంత పవర్ ఫుల్ వెపన్ ఇది. ప్రస్తుతం రష్యా దగ్గర మాత్రమే ఉన్న దీన్ని ఇండియాకు ఇస్తే మిగతా దేశాలు వణికిపోవాల్సిందే.
ఎలాంటి యుద్ధాలు వచ్చినా ఇండియాను ఏమీ చేయలేవు. ఇక నుంచి ఏ దేశం కూడా మనల్ని ఇబ్బంది పెట్టాలని చూడదు. దీంతో పాటు సుఖోయ్–30 MKI ఒప్పందం కూడా ఇందులో కీలకంగా ఉంది. ఇవి మన దగ్గర ఉంటే ప్రపంచ దేశాలల్లో మిలటరీ పరంగా ఇండియా బలంగా మారుతుంది. అప్పుడు అగ్ర దేశాలు ఇండియాను ఏమీ చేయలేవు. ఇండియా రక్షణ రంగంలో S-500 అత్యంత కీలక పాత్ర పోషించే ఛాన్స్ ఉంటుంది.
Read Also: ఆహా ఏమి రుచి.. పుతిన్ మెచ్చిన భారతీయ వంటకాలివే!
Follow Us On: Pinterest


