epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

భాగ్యనగరంలో భౌభౌ.. మొన్న హయత్ నగర్, నిన్న యూస‌ఫ్‌గూడలో!

హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు(Stray Dog Attacks) రెచ్చిపోతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకు ఎవరు కనబడినా కరిచి తీవ్ర గాయాలపాలు చేస్తున్నాయి. సాధారణంగా ఎండాకాలంలో రెచ్చిపోయే వీధి కుక్కలు చలికాలంలోనూ నగర ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. దీంతో పిల్లలు ఒంటిరిగా బయటకు పంపాలంటే తల్లిదండ్రులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు. గత ఆరు నెలల్లో కుక్కకాటు కేసులు పెరగడంతో నారాయణగూడ, ఫీవర్ ఆస్పత్రులకు బాధితుల సంఖ్య పెరిగిపోయిందని వైద్యవర్గాలు చెబుతున్నాయి. నగరంలో తరచుగా కుక్కకాటు కేసులు నమోదవుతున్నా జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కుక్కల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని నగర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇటీవల హయత్ నగరలో జరిగిన మూగ బాలుడిని కుక్కల గుంపు తీవ్రంగా కరిచి భయాందోళనకు గురిచేసిన విషయం తెలిసిందే. అయితే ఆ పిల్లొడు స్వెట్టర్ ధరించడంతో ప్రాణాలతో బయటపడ్డాడు.హయత్ నగర్ ఘటన మరువకముందే, నగరంలో మరో ఘటన వెలుగుచూపింది. యూసుఫ్ గూడలో ఓ పిల్లాడు ఆరు బయట ఆడతుండగా, ఓ వీధి కుక్క దాడి(Stray Dog Attacks) చేసి గాయపర్చింది. అయితే సకాలంలో ఆ పిల్లాడి తాత స్పందించడంతో ప్రమాదం తప్పింది. అప్పటికే పిల్లాడి ఒంటిపై కుక్కగాట్లు గుర్తించారు. ఈ రెండు ఈ ఘటనలతో మరోసారి నగరవాసులు ఉలిక్కిపడ్డారు. అయితే సీఎం రేవంత్ సైతం హయత్ నగర్ ఘటనపై రియాక్ట్ అయినప్పటికీ, జీహెచ్ఎంసీ ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని నగరవాసులు మండిపడుతున్నారు. వెంటనే వీధి కుక్కల కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read Also: జీలకర్ర నీటితో కొవ్వు కరుగుతుందా? అసలు రహస్యం ఇది..!

Follow Us On: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>