కలం, ఖమ్మం బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి(Bhuvaneshwari)ని పోలీసులు అడ్డుకున్నారు. శుక్రవారం ఖమ్మం జిల్లాలోని కూసుమంచి మండలం నాయకన్ గూడెం సమీపంలో చెక్ పోస్ట్ దగ్గర ఆమె ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆపి చెక్ చేశారు. జిల్లాలో మూడవ విడత సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్న గ్రామాల్లో నామినేషన్ల గడువు ఈ రోజుతో ముగియడంతో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే హైద్రాబాద్ నుంచి జంగారెడ్డి గూడెం వెళ్తున్న నారా భువనేశ్వరి(Bhuvaneshwari) వాహనాన్ని పోలీసులు ఆపి తనిఖీలు చేశారు. అయితే, ఇది రొటీన్ చెకప్ లో భాగం అని కూసుమంచి సీఐ జితేందర్ తెలిపారు.
కాగా, ఒకప్పుడు ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాగా ఉండేది. తెలంగాణ ఏర్పడిన తరువాత కూడా ఈ జిల్లాలో టీడీపీ హవా నడిచింది. ఖమ్మం రెండు ప్రాంతాల రాజకీయాలకు ఒకప్పుడు గుమ్మంగా ఉందనేది అందరికి తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లా రెండు రాష్ట్రాలకు సరిహద్దుగా ఉంది. దీంతో ఈ ప్రాంతంలో ఎలాంటి సంఘటన జరిగినా తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లోనూ ప్రభావం చూపుతుంది.
Read Also: హార్ట్ ఎటాక్స్ కు వ్యాక్సిన్ కారణం కాదు : కేంద్రం
Follow Us On: Pinterest


