కలం, తెలంగాణ బ్యూరో : అకస్మాత్తుగా గుండెపోటు (Heart Attacks) వచ్చి నిమిషాల వ్యవధిలోనే ఇటీవల చనిపోతున్న ఘటనలపై కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ పెదవి విప్పింది. సడెన్ హార్ట్ అటాక్స్ కు కరోనా (Covid-19) వ్యాక్సిన్స్ కారణం కాదని స్పష్టత ఇచ్చింది. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత గుండెనొప్పి, గుండెపోటు వచ్చిందనే అపోహలకు ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవన్నది. కోవాగ్జిన్ (Covaxin), కొవిషీల్డ్ (Covishield) వ్యాక్సిన్ వేసుకోవడం ద్వారా హార్ట్ అటాక్ రాకుండా ఉంటుందని నొక్కిచెప్పింది. రెండుసార్లు అంతకంటే ఎక్కువ వ్యాక్సిన్ వేసుకున్నవారికి మరింత ప్రొటెక్షన్ ఉంటుందని తెలిపింది. జిమ్‌లో ఎక్సర్‌సైజ్ చేస్తూ, క్యూ లైన్‌లో నిల్చుని హఠాత్తుగా కుప్పకూలి చనిపోయిన ఘటనలపై ఐసీఎంఆర్ (ICMR), ఎయిమ్స్ (AIIMS)-ఢిల్లీ నిపుణులు జరిపిన అధ్యయనంలో ఇది వెల్లడైంది. కరోనా బారిన పడినవారు సడెన్ అటాక్స్ కు గురై చనిపోతున్నారని, ఎక్కువగా పిల్లలు, యువత, నడి వయసువారిలో ఈ సమస్య ఉన్నదని తెలిపింది. స్మోకింగ్, వంశపారంపర్యంగా గుండెపోటు రావడం, ఇతర అనారోగ్య సమస్యలున్నవారు వైరస్ బారిన పడిన తర్వాత సడెన్ స్ట్రోక్‌తో చనిపోతున్నారని వెల్లడించింది.
కరోనా సోకడమే ప్రధాన కారణం
కరోనా వైరస్‌కు గురైన తర్వాత ఆ ప్రభావం గుండెపై కనబడుతున్నదని, సడెన్ స్ట్రోక్స్, హార్ట్ అటాక్స్(Heart Attacks), కార్డియో వాస్కులర్ (Cardiovascular) సమస్యలకు అదే కారణమని కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కరోనా ఇన్ఫెక్షన్ వల్ల మయోకార్డిటిస్ (Myocarditis), అరిత్‌మియాస్ (Arrhythmias), హైపర్‌టెన్షన్ (Hypertension), హార్ట్ ఫెయిల్యూర్ తదితర సమస్యలు వస్తున్నట్లు పేర్కొంది. దీర్ఘకాలం వైరస్ ప్రభావం శరీరంపై ఉంటున్నదని, రక్తకణాల్లో ఇది ఉండిపోతున్నదని వెల్లడించింది. ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రజెనికా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తంలో ప్లేట్‌లెట్స్ పడిపోవడం, అసాధారణంగా రక్తం నాళాల్లోనే గట్టకట్టడం (Blood Clots) జరుగుతున్నట్లు అంతర్జాతీయ శాస్త్రీయ అధ్యయనంలో తేలిందని ఎయిమ్స్ నిపుణుల బృందం పేర్కొన్నది. వ్యాక్సిన్ వేసుకున్న రెండు వారాల్లో బ్రెయిన్, పొట్ట భాగంలోని రక్త నాళాల్లో గడ్డకట్టిన ఇన్సిడెంట్స్ జరిగినట్లు గుర్తుచేసింది.
Read Also: డర్టీ సిటీ.. చెత్త నగరంగా హైదరాబాద్
Follow Us On: Facebook


