కలం, వెబ్‌డెస్క్: ఆలయాల సొమ్ము దేవునికి సంబంధించిందని, దానిని జాగ్రత్త చేయడం, రక్షించడంతోపాటు ఆలయాల అవసరాలు తీర్చడానికి మాత్రమే వాడాలని సుప్రీంకోర్టు(Supreme Court) వ్యాఖ్యానించింది.అంతేకాదు, ఆలయాల సొమ్ము ఉండేది సహకార బ్యాంకుల్నికాపాడడానికి కాదని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చితో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.కేరళలోని తిరునెల్లి దేవస్థానం.. ఆలయానికి సంబంధించిన సొమ్మును రెండు కోఆపరేటివ్ బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది.
ఇటీవల ఆ సొమ్మును తిరిగి ఇవ్వాలని కోరగా సదరు బ్యాంకులు నిరాకరించాయి. దీనిపై దేవస్థానం బోర్డు ఆ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించగా, తీర్పు దేవస్థానానికి అనుకూలంగా వచ్చింది. రెండు నెలల్లోగా దేవస్థానానికి సొమ్మును అందజేయాలని ఆ బ్యాంకుల్ని ఆదేశించింది. దీనిపై కోఆపరేటివ్ బ్యాంకులు సుప్రీం(Supreme Court)ను ఆశ్రయించాయి. ఆ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం పై విధంగా వ్యాఖ్యానించింది.దేవస్థానం బోర్డుకు సొమ్మును తిరిగి అందజేసేందుకు గడువు పెంచాలని హైకోర్టును కోరాలని సూచిస్తూ, పిటిషన్ కొట్టివేసింది.
Read Also: ఇండిగో ప్రయాణికులకు డీజీసీఏ గుడ్ న్యూస్..
Follow Us On: X(Twitter)


