కలం, వెబ్ డెస్క్: దివంగత ఎమ్మెల్యే గోపీనాథ్ మరణంతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనివార్యం అయింది. ఈ బైపోల్(Jubilee Hills Bypoll) కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్(Naveen Yadav) విజయం సాధించిన విషయం తెలిసిందే. ఉప ఎన్నికకు సంబంధించిన ఖర్చు వివరాలను ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సమాచార హక్కు చట్టం ద్వారా కోరింది. దీనికి ఆర్థిక శాఖ సమాధానం ఇస్తూ వివరాలను వెల్లడించింది. ఎన్నికల నిర్వహణకు రూ.రూ. 5 కోట్ల 91 లక్షల 60 వేలు ఖర్చు పెట్టినట్లు ఆర్టీఐ వెల్లడించింది. ప్రభుత్వం, అభ్యర్థులు పెట్టిన భారీ ఖర్చులపై ఆడిట్ చేయాలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు పద్మనాభ రెడ్డి ఆర్టీఐకి అర్జీ పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఉప ఎన్నికకు సంబంధించి ప్రభుత్వంతో పాటు అభ్యర్థులు పెట్టిన ఖర్చు వివరాలను ఆర్టీఐ ప్రకటించింది.
నవంబర్ 11 నాడు జరిగిన జూబ్లీహిల్స్ బైపోల్(Jubilee Hills Bypoll) లో బీర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ భార్య సునీత బరిలో దిగగా.. కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ పోటీ చేశారు. నువ్వానేనా అన్నట్లు వీరిద్దరు ప్రచారం చేశారు. ఎన్నిక సమయంలో అనేక కాంట్రవర్సీలు, గొడవలు మధ్య పోలింగ్ పూర్తయింది. చివరకు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయం సాధించారు. నియోజకవర్గంలో మొత్తం 4,01,365 ఓట్లు ఉండగా 1,94,621 ఓట్లు పోలయ్యాయి. 48.49 శాతం పోలింగ్ నమోదైంది.
Read Also: మంత్రి కోమటిరెడ్డి యూటర్న్
Follow Us On: Facebook


