పుష్ప-2 రిలీజ్ అయి నేటికి ఏడాదయిన సందర్భంగా అల్లు అర్జున్(Allu Arjun) స్పెషల్ పోస్టు పెట్టాడు. సుకుమార్ తో పనిచేయడం గొప్ప అనుభవం అన్నాడు. నిర్మాణ సంస్థ గురించి, అందుకున్న అవార్డులు, రివార్డుల గురించి పోస్టులో రాసుకొచ్చాడు. బాగానే ఉంది. మరి శ్రీతేజ సంగతేంటి. పుష్ప-2 ప్రీమియర్స్ కోసం వెళ్లి సంధ్య థియేటర్ లో తొక్కిసలాటకు గురై రేవతి చనిపోయింది. శ్రీతేజ ఏడాదిగా జీవచ్చవంలా పడి ఉన్నాడు. మాటలేదు, కదలిక లేదు. ఇప్పటికీ పైపుల ద్వారానే ద్రవ పదార్థాలు పెడుతూ బతికిస్తున్నారు. అల్లు అర్జున్ కు శ్రీతేజ పెద్ద అభిమాని. బన్నీని చూడటానికి వచ్చి.. బతుకే లేకుండా చేసుకున్నాడు.
మరి అలాంటి శ్రీతేజ గురించి ఒక్క మాట కూడా బన్నీ మాట్లాడలేదు. నిన్న శ్రీతేజ తండ్రి భాస్కర్ వెళ్లి దిల్ రాజును కలిశాడు. శ్రీతేజకు రిహాబిటేషన్ ట్రీట్ మెంట్ మళ్లీ అందించాలని.. దానికి మరింత సాయం కావాలని వేడుకున్నాడు. నిజంగా ఎంత దారుణం. భాస్కర్ డైరెక్ట్ గా అల్లు అర్జున్ ను కలిసే ఛాన్స్ కూడా లేదు. శ్రీతేజను అన్ని విధాలుగా ఆదుకుంటానన్న బన్నీ.. కనీసం తన టీమ్ తో భాస్కర్ ను ఎప్పటికప్పుడు కలిసే వెసలుబాటు కల్పించి ఉంటే బాగుండేది. సినిమా గురించి మాట్లాడిన బన్నీ శ్రీతేజకు అన్ని విధాలుగా ఆదుకుంటానని ఒక్క మాట చెప్పినా ప్రశంసలు అందుకునేవాడు. కానీ తనకొచ్చిన ప్రశంసలు గురించే చెప్పుకున్నాడు. తన వల్ల ఇబ్బంది పడ్డ ఫ్యామిలీ గురించి మాట్లాడలేదు. ఈ విషయంలో బన్నీ ఒకసారి ఆలోచన చేసి ఉండాల్సింది.

Read Also: హార్ట్ ఎటాక్స్ కు వ్యాక్సిన్ కారణం కాదు : కేంద్రం
Follow Us On: X(Twitter)


