కలం, వెబ్ డెస్క్ : ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University) అభివృద్ధి పనులపై శుక్రవారం జూబ్లీ హిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, వీసీ, ప్రొఫెసర్ల తో కలిసి అధికారులు యూనివర్సిటీలో పర్యటించాలని ఆదేశించారు. ఈ నెల 10 వ తేదీన యూనివర్సిటీని సందర్శిస్తానని తెలిపారు. విద్యార్థుల సంఖ్య ఆధారం గా యూనివర్సిటీ లో భవన నిర్మాణాలు ఉండాలని అధికారులకు సూచించారు. యూనివర్సిటీ అభివృద్ధి కోసం ఎంత ఖర్చు పెట్టడానికైనా సిద్ధం ఉన్నట్లు సీఎం స్పష్టం చేశారు. భవనాల మరమ్మతుల కంటే కొత్త భవనాలు నిర్మాణం పైనే దృష్టి పెట్టాలన్నారు. యూనివర్సిటీ అభివృద్ధి ప్రణాళిక పైన విద్యార్థుల అభిప్రాయాలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
విద్యార్థుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని డిసెంబర్ 31 న పూర్తి ప్రణాళిక ను ప్రకటించాలని రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పష్టం చేశారు. బెస్ట్ యూనివర్సిటీ గా ఉస్మానియా ను తీర్చిదిద్దడంతో పాటు ప్రపంచంతో పోటీపడేలా యూనివర్సిటీ విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. యూనివర్సిటీ అధ్యాపకులను విదేశాలకు పంపి శిక్షణ ఇవ్వాలని అధికారులకు సీఎం సూచించారు. సమీక్షకు ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు, సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి యోగితా రాణా , సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ దేవసేన, ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీం, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
Read Also: రెండేళ్లలో ఒక్క సెలవు తీసుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Pinterest


