కలం, ఖమ్మం బ్యూరో : సర్పంచ్ ఎన్నికల వేళ గ్రామాల్లో లిక్కర్ ఏరులై పారుతోంది. ముఖ్యంగా ఖమ్మం(Khammam) జిల్లాలో బెల్టుషాపుల జోరు మామూలుగా లేదు. ఏ గ్రామానికి వెళ్లినా బెల్టు షాపుల్లో పెద్ద ఎత్తున లిక్కర్(Liquor) సీసాలే కనిపిస్తున్నాయి. దీంతో బెల్ట్ షాపులపై టాస్క్ ఫోర్స్ బృందాలు దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ. నాలుగు రోజుల్లో 4 లక్షల విలువ చేసే 6 వందల లీటర్ల మద్యాన్ని సీజ్ చేశారు.
Khammam | సీపీ సునీల్ దత్ ఆదేశాలతో కొణిజర్ల, రఘునాదపాలెం, చింతకాని, VM బంజారా, ముదిగొండ, ఖమ్మం రూరల్, సత్తుపల్లి, తిరుమలాయపాలెం, వెంసూర్ లోని బెల్టు దుకాణాలపై దాడులు నిర్వహించామన్నారు. రూ.4 లక్షల విలువ చేసే IMFL సుమారు 600 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు. దాన్ని పోలీస్ స్టేషన్ కు తరలించామన్నారు. ఏన్కూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్సై సంధ్య ఆధ్వర్యంలో బెల్ట్ షాపులపై దాడులు నిర్వహించి 42 వేల విలువ చేసే 240 లీటర్ల మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
Read Also: రెండేళ్లలో ఒక్క సెలవు తీసుకోలేదు: సీఎం రేవంత్ రెడ్డి
Follow Us On: Pinterest


