Mobile Popup Ad
Mobile Popup Ad

రంజాన్ వేళ ఖమ్మంలో పటిష్ట భద్రత : సీపీ

కలం, ఖమ్మం బ్యూరో : రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం (Khammam) కమిషనరేట్ పరిధిలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లను చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ఈద్గా ప్రాంతాల్లో ముస్లింల సామూహిక ప్రార్థనలను దృష్టిలో ఉంచుకొని శుక్రవారం నగరం (Khammam)లోని గోళ్లగూడెం ఈద్గా ప్రాంతాన్ని మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్యతో కలసి పోలీస్ కమిషనర్ సందర్శించారు. ట్రాఫిక్, పార్కింగ్, భద్రతపై నిర్వాహకులతో పాటు అధికారులతో చర్చించారు.

ప్రత్యేక ప్రార్థన కోసం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పండుగ సందర్భంగా పార్కింగ్ ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా చూడాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు. ముస్లింలు రంజాన్ పవిత్ర పండుగను కుటుంబ సభ్యులతో కలిసి అనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టౌన్ ఏసీపీ రమణమూర్తి, ఇన్స్పెక్టర్లు భానుప్రకాష్, సత్యనారాయణ, రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>