కలం, వరంగల్ బ్యూరో : జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చెల్పూర్ కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ (KTPS) లో శుక్రవారం 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బాయిలర్ ట్యూబ్ లీకేజీ కావడంతో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినట్లు అధికారులు తెలిపారు. ఇలా విద్యుత్ ఉత్పత్తి ఆగిపోవడం వల్ల రోజుకు దాదాపు రూ.2 కోట్ల మేర నష్టం వాటిల్లుతుందని అధికారుల అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మరమ్మతులు చేపట్టిన అధికారులు త్వరితగతిన విద్యుత్ ఉత్పత్తి ప్రారంభిస్తామని తెలిపారు.

