కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో జరగబోయే గ్లోబల్ సమ్మిట్(Global Summit) కు రంగం సిద్ధమైంది. ఈ నెల 8, 9న జరిగే సమ్మిట్ ను దేశమంతా మాట్లాడుకునేలా రేవంత్(Revanth) నిర్వహిస్తామంటున్నారు. ప్రధాని మోడీ, రాహుల్ గాంధీ, ప్రియాంక, ఖర్గేలను ఆహ్వానించారు. పదిహేను రాష్ట్రాలకు పైగా సీఎంలలకు మంత్రులు ఆహ్వానం పలికారు. అయితే మాజీ సీఎం కేసీఆర్(KCR) గురించి చర్చ మొదలైంది. ఎంత రాజకీయ విరోధాలు ఉన్నా రాష్ట్రానికి సంబంధించిన అతిపెద్ద ప్రోగ్రామ్ కాబట్టి మాజీ సీఎం హోదాలో కేసీఆర్ ను పిలవాల్సిందే. త్వరలోనే ప్రభుత్వం తరఫున ఎవరో ఒకరు వెళ్లి ఆహ్వానిస్తారని తెలుస్తోంది.
మరి కేసీఆర్ ఈ ప్రోగ్రామ్ కు వస్తారా అనే చర్చ స్టార్ట్ అయింది. రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయే ప్రోగ్రామ్ కాబోతోంది ఇది. కాబట్టి కేసీఆర్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ ఆయన వస్తే అదో సంచలనమే. ఎందుకంటే అటు ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించారు. ఈ లెక్కన కేసీఆర్, చంద్రబాబు, రేవంత్ ఒకే వేదికపై కనిపించే ఛాన్స్ ఉంటుంది. అదే జరిగితే తెలుగు రాష్ట్రాల్లో ఒక కొత్త చరిత్రే అవుతుంది. ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ను రెండు ప్రోగ్రామ్స్ కు పిలిచినా రాలేదు.
తెలంగాణ రాజకీయాల్లో ఇలా ప్రత్యర్థులు ఒకే వేదికపై కనిపించిన సందర్భాలు లేవు. పైగా చంద్రబాబు సీఎం అయ్యాక ఒక్కసారి కూడా కేసీఆర్ కలవలేదు. ఇంకోవైపు ప్రధాని నరేంద్ర మోడీని, రాహుల్ ను ఆహ్వానించారు. వాళ్లిద్దరూ వస్తే అది ఇంకో చరిత్రే. కాకపోతే రెండు రోజులు సమ్మిట్ ఉంటుంది కాబట్టి ఏ రోజు ఎవరు వస్తారనేది ఇంకా క్లారిటీ రాలేదు. ప్రధాని ఫస్ట్ డే వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి రాహుల్ రెండో రోజు రావచ్చేమో. సీఎం చంద్రబాబు కూడా వస్తే మొదటిరోజే రావచ్చు. మిగతా రాష్ట్రాల సీఎంలలో సగం మంది అయినా వస్తారనే గ్యారెరంటీ లేదు. కాబట్టి ఫోకస్ మొత్తం మోడీ, రాహుల్, చంద్రబాబు, కేసీఆర్, రేవంత్ మీదనే ఉంది. ఈ ఐదుగురు ఒకే వేదికపై(Global Summit) కనిపిస్తారా లేదా అనేది చూద్దాం.
Read Also: కేటీఆర్ కోసమే కేసీఆర్ బయటకు రావట్లేదా?
Follow Us On: Pinterest


