కలం, వెబ్ డెస్క్: కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (Kaloji Health University) ఇన్‌చార్జ్ వీసీగా రాష్ట్ర ప్రభుత్వం డాక్టర్ రమేశ్ రెడ్డిని నియమించింది. రమేశ్ రెడ్డి ప్రస్తుతం యాదాద్రి భువనగిరి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. గతంలో డీఎంఈగా పని చేసిన అనుభవం ఉంది. ఇటీవల కాళోజీ హెల్త్‌వర్సిటీలో ప్రశ్నాపత్రాల వాల్యూయేషన్‌లో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. మార్కుల కేటాయింపులో గోల్‌మాల్ జరిగినట్లు విమర్శలు రావడంతో వీసీ రాజీనామా చేశారు.
వివాదం ఏమిటి?
ఇటీవల కాళోజీ వర్సిటీలో (Kaloji Health University) రీ వాల్యుయేషన్‌లో అవకతకవలు జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత వీసీ నందకుమార్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉన్నదాధికారులతో ఆదేశాలతో నందకుమార్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. పీజీ, అండర్ గ్రాడ్యుయేట్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు రీ కౌంటింగ్ బదులుగా రీ వాల్యువేషన్ చేయించి పాస్ అయ్యేలా చేయించారని నందకుమార్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి సంఘాల నుంచి విమర్శలు రావడంతో ప్రభుత్వం వీసీని తొలగించింది.


