సంధ్య థియేటర్ ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సరిగ్గా ఏడాది కావడంతో నిర్మాత దిల్ రాజు(Dil Raj) గురువారం స్పందించారు. శ్రీతేజను పూర్తిస్థాయిలో ఆదుకుంటామని, ఇప్పటికే రెండు కోట్ల రూపాయల డబ్బులు డిపాజిట్ చేశామని తెలిపారు. వడ్డీ రూపంలో వస్తున్న డబ్బులను ప్రతినెల శ్రీతేజ తండ్రికి వచ్చేలా చేశామని, ఆస్పత్రిలో దాదాపు 70 లక్షల రూపాయలు పే చేశామని ఆయన చెప్పారు. రిహాబిలిటేషన్ కేంద్రంలో అయ్యే ఖర్చును కూడా అల్లు అర్జున్ భరిస్తున్నారని, శ్రీతేజ(Sriteja) ఆరోగ్యం ఇప్పుడిప్పుడే బాగా కుదుటపడుతుందని దిల్ రాజు అన్నారు.
అయితే ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటంతో శ్రీ తేజ(Sriteja) తండ్రి రియాక్ట్ అయ్యాడు. అల్లు అర్జున్(Allu Arjun) టీం చాలావరకు బాగా రెస్పాండ్ అయ్యిందని, ఇప్పటివరకు అన్ని విధాల అల్లు టీం మమ్మల్ని ఆదుకుందని ఆయన అన్నారు. మరికొంత ఆర్థిక సహాయం అవసరం ఉందని, అన్ని విషయాలు దిల్ రాజు తోటి మాట్లాడామని, ఆయన అన్ని విధాల సహాయం చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారని మీడియాతో వెల్లడించారు. అయితే ఈ ఘటనకు ఏడాది కావోస్తున్న శ్రీతేజ కుదుటపడలేదని, ఇప్పటికే ఆహారం తీసుకోవడం లేదని, కేవలం ద్రవ పదార్థాలు మాత్రమే తీసుకుంటున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఘటనపై అనేక భిన్నాభిప్రాయాలు ఉండటంతో శ్రీ తేజ తండ్రి సానుకూలంగా స్పందించడం చర్చనీయాంశమవుతోంది.
Read Also: ప్రభాస్ పక్కన ప్రియాంక చోప్రా.. రాజమౌళి డీల్..?
Follow US On: X(Twitter)


