epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

ఏంట్రా ఇది.. ‘బాంబ్ కేక్‌’తో బర్డ్ డే పార్టీ.. చివరికి ఏమైందంటే?

Surprise Birthday Plan |పుట్టిన రోజు అంటే ఆనందంగా, ఉత్సాహంగా జరుపుకునే వేడుక. సంవత్సరానికి ఒకసారి సెలబ్రేట్ చేసుకునే ఇలాంటి రోజును కూడా కొందరు అత్యుత్సాహంతో నవ్వులపాలు చేస్తున్నారు. వికృత చేష్టలతో బర్త్ డే అనే దానికి అర్థం మార్చేస్తున్నారు. కేక్ కటింగ్ అని చెప్పి స్నేహితులు చేస్తున్న పనులు అన్నీ ఇన్ని కావు. బర్త్ డే బంప్స్, గుడ్లు కొట్టడం, తన్నడం, కొట్టడం లాంటి చేష్టలతో విపరీతంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఓ బర్త్ డే పార్టీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

స్నేహితుల ఓవర్ యాక్షన్ వలన పుట్టినరోజు కాస్త విషాదంగా మారింది. ఈ వీడియో చూసిన జనాలు భయంగా ఫీల్ అవుతున్నారు. ఏం పోయే కాలం అంటు తిట్టుకుంటున్నారు. సరదాగా చేయాల్సిన పనులు ప్రాణం మీదకు రాకూడదు అని ఈ వీడియో హెచ్చరిస్తుంది. వైరల్ వీడియోలో కొంతమంది వారి స్నేహితుడి పుట్టిన రోజును సెలబ్రేట్ చేయడాని సర్‌ప్రైజ్ ప్లాన్(Surprise Birthday Plan) చేశారు. ఎవరికీ తెలియకుండా కేక్ లోపల పటాకులను అమర్చారు. సాధారణ కేకులా తయారు చేశారు.

ఆ కేక్ లో పటాకులు ఉన్నట్లు గ్రహించలేని వారు. ఎప్పటిలాగానే కొవ్వొత్తిని వెలిగించారు. ఇంకేముందు అందులోని క్రాకర్ బాంబులు తీవ్ర శబ్ధం చేస్తూ పేలాయి. దీంతో కేక్ తునాతునకలు అవుతూ పేలిపోయింది. సమీపంలో ఉన్నవాళ్ల ఒక్కసారిగా భయాందోళనకు గురై అక్కడి నుంచి దూరంగా పారిపోయారు. ఇదంతా అక్కడ రికార్డింగ్ లో పెట్టిన ఫోన్ లో రికార్డ్ అయింది. అదృష్టవశాత్తు అక్కడ ఉన్నవారికి పెద్దగా గాయాలు కాలేదు. కానీ, కొందరి బట్టలకు మంటలు అంటుకున్నాయి. బర్త్ డే జరుపుకుంటున్న వ్యక్తి కూడా తప్పించుకోగలిగాడు.

ఈ వీడియో ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికగా లక్షల్లో వ్యూస్ వాచ్చాయి. దీనిని చూసిన కొందరు నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది ’ఘోరమైన జోక్’ అని ఒకరు పెడితే.. ‘మీరు స్నేహితులు కాదు.. శత్రువులు’ అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఇలాంటి వికృత చర్యలు సమాజంలో నెగెటివ్ ఇంపాక్ట్ చూపిస్తాయని అభిప్రాయాలు వ్యక్తం అవుతన్నాయి. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని సూచిస్తారు.

Read Also: రహస్య వీడియోలతో బెదిరింపులు.. పోలీసులను సైతం ట్రాప్, కిలేడీ అరెస్ట్

Follow US On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>