టాలీవుడ్ స్టార్ హీరోలందరూ జపాన్(Japan) జపం చేస్తున్నారు. పాన్ ఇండియాలో హిట్ అయితే వెంటనే జపాన్ ఫ్లైట్ ఎక్కుతున్నారు. దేవర సినిమా ఇండియాలో హిట్ అయిన కొన్ని రోజులకు జపాన్ లో పెద్ద ఎత్తున రిలీజ్ చేశారు. ఎన్టీఆర్ జపాన్ వెళ్లి ప్రమోట్ చేశాడు. ఇప్పుడు అల్లు అర్జున్(Allu Arjun) కూడా అదే బాటలో నడుస్తున్నాడు. పుష్ప-2(Pushpa 2) సినిమాను జపాన్ లో రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. పుష్ప-1 రిలీజ్ చేయాలని అనుకున్నా.. దానికి పెద్దగా ఆదరణ రాలేదు. రెండోపార్టుకు ఇంటర్నేషనల్ వైడ్ గా పాపులారిటీ దక్కడంతో జపాన్ మీద పుష్పరాజ్ కన్నేశాడు.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.. గీక్ పిక్చర్స్, షోచికు స్టూడియోలతో కలిసి జపాన్ లో ఈ సినిమాను ‘పుష్ప కున్రిన్’ పేరుతో పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నారు. నిన్న జపాన్ లాంగ్వేజ్ లో ట్రైలర్ వదిలారు. జనవరి 16న మూవీని థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు. ఎన్డీఆర్ దేవరకు సూపర్ రెస్పాన్స్ దక్కింది. అల్లు అర్జున్ సినిమాకు కూడా అదే స్థాయిలో ఆదరణ దక్కుతుందా అనే చర్చ మొదలైంది. జపాన్ లో ఎమోషన్స్ సినిమాలకు ఎక్కువ రెస్పాన్స్ ఉంటుంది. పైగా ఎర్రచందనం ఎక్కువ దిగుమతి చేసుకునే దేశాల్లో జపాన్ ఉంది. పుష్ప-2(Pushpa 2) జపాన్ లొకేషన్స్ లో షూటింగ్ చేశారు. పార్టు-3 జపాన్ తోనే లింక్ అయి ఉంటుందంట. ఇవన్నీ సినిమాకు సూపర్ క్రేజ్ తీసుకొస్తాయా లేదా చూడాలి.
Read Also: ఎస్పీబీ విగ్రహంపై రచ్చ.. బుద్ధుడి విగ్రహంపై చర్చ
Follow Us On: X(Twitter)


