హెచ్1బీ వీసా (H-1B Visa) ఆశావహులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరో షాక్ ఇచ్చారు. విదేశీయులు విద్య, ఉద్యోగాల పేరుతో అమెరికాలోకి వచ్చి పాతుకుపోతున్నారని భావిస్తున్న ట్రంప్ వీసాల జారీకి రకరకాల కొర్రీలు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే హెచ్1బీ వీసా ఫీజు పెంచడంతోపాటు దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల తనిఖీ, ప్రయాణ చరిత్ర వంటివి క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.ఇప్పుడు మరో నిర్ణయం తీసుకున్నారు. హెచ్1బీ దరఖాస్తుదారుడు ఏదైనా తప్పుడు ప్రచారం లేదా విద్వేష ప్రసంగాలు చేసినా, వాక్ స్వాతంత్ర్యం అణచివేసే కార్యకలాపాల్లో భాగమైనా వాళ్ల వీసా తిరస్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
ఈ కొత్త నిబంధన ప్రకారం హెచ్1బీ వీసా దరఖాస్తుదారులు (H-1B Visa Applicants), వారితో ట్రావెల్ చేసే కుటుంబ సభ్యుల లింక్డ్‌ఇన్, రెజ్యూమె వివరాలను క్షుణ్నంగా పరిశీలిస్తారు. అమెరికాకు, అమెరికా చట్టాలకు వ్యతిరేకంగా ఉన్న తప్పుడు సమాచారం, ప్రసంగాలు, కంటెంట్ నియంత్రణ, ఫ్యాక్ట్ చెకింగ్, ఆన్‌లైన్ సేఫ్టీ వంటి వాటిలో దరఖాస్తుదారులకు, వాళ్ల కుటుంబసభ్యులకు ప్రమేయం ఉన్నట్లు భావిస్తే వీసాలను తిరస్కరిస్తారు.దీనికోసం దరఖాస్తుదారులు తమ సోషల్ మీడియా ఖాతాల ప్రైవసీ సెట్టింగ్‌లను పబ్లిక్ చేయాలని అమెరికా యంత్రాంగం ఆదేశించింది.
Read Also: క్రికెట్‌కు టీమిండియా ఫాస్ట్ బౌలర్ గుడ్‌బై
Follow Us On: WhatsApp Channel


