విజయ్ దేవరకొండ-రష్మిక(Rashmika Mandanna) పెళ్లిపై పెద్ద రచ్చ జరుగుతూనే ఉంది. రీసెంట్ గానే వీరిద్దరి ఎంగేజ్ మెంట్ జరిగినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఫిబ్రవరిలో పెళ్లి అంటూ వార్తలు వస్తున్నాయి. వీటిపై తాజాగా రష్మిక ఓ హాలీవుడ్ మీడియాతో మాట్లాడుతూ స్పందించింది. ఆ వార్తలను నేను ఇప్పుడే ఖండించలేను. అలా అని కన్ఫర్మ్ చేయలేను. వాటిపై సమయం వచ్చినప్పుడే మాట్లాడుతాను. అప్పటి వరకు పెళ్లి గురించి మాట్లాడలేను అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఆమె పెళ్లి ఫిక్స్ అయిందని ఆమె కామెంట్లను బట్టి తెలిసిపోతోంది. కాకపోతే అది ఫిబ్రవరిలో అవునా కాదా అనేది మాత్రం తెలియాల్సి ఉంటుంది. రష్మిక, విజయ్ ఎంగేజ్ మెంట్ జరిగిన తర్వాత ఈ వార్తలను ఒక్కసారి కూడా ఖండించలేదు.
ఆ మధ్య ఓ ఈవెంట్ లో రష్మిక(Rashmika Mandanna)ను ఎంగేజ్ మెంట్ అయిందా అని ఫ్యాన్స్ అడిగితే.. మీరేం అనుకుంటే అదే నిజం అంటూ ఇన్ డైరెక్ట్ గా ఒప్పేసుకుంది. మొన్న ఈవెంట్ లో అందరిముందే విజయ్(Vijay Deverakonda) ఆమె చేతికి ముద్దివ్వడం కూడా చూశాం. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా ఇలాంటి కామెంట్లు చేస్తూ అందరికీ ఓ క్లారిటీ ఇచ్చేసింది. కాకపోతే ఇంకెప్పుడు అఫీషియల్ గా ప్రకటిస్తారో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం రష్మిక రెండు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది. అటు విజయ్ దేవరకొండ చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. చూస్తుంటే కొత్త సంవత్సరంలో ఓ ఇంటివారు అయ్యేలాగే ఉన్నారు.
Read Also: నాకు సానుభూతి అక్కర్లేదు.. రాజ్ నిడుమోరు మాజీ భార్య కామెంట్
Follow Us On: WhatsApp Channel


