epaper
Tuesday, November 18, 2025
epaper

క్రికెట్ ప్రపంచంలో నేపాల్ రికార్డ్..

కలం డెస్క్ : Nepal vs West Indies | వెస్టిండీస్‌కు నేపాల్ క్రికెట్ టీమ్ భారీ షాక్ ఇచ్చింది. ఈ రెండు దేశాల మధ్య జరిగిన ద్వైపాక్షిక సిరీస్‌లో పసికూన నేపాల్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. నేపాల్, వెస్టిండీస్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగుతోంది. వీటిలో తొలి రెండు మ్యాచ్‌లలో నేపాల్ విజయం సాధించింది. తొలి టీ20లో 19 పరుగుల తేడాతో విజయం సాధించగా, రెండో టీ20లో వెస్టిండీస్‌ను 83 పరుగులకే ఆలౌట్ చేసింది. దీంతో రెండో మ్యాచ్‌లో 90 పరుగుల తేడాతో నేపాల్ గెలిచింది. ఇప్పుడు మూడో మ్యాచ్.. నేపాల్‌కు చాలా ప్రత్యేకం కానుంది. అది కూడా గెలిస్తే వెస్టిండీస్‌ను క్లీన్ స్వీప్ చేసిన ఘనత అందుకుంది. ఇది మాజీ వరల్డ్ ఛాంపియన్‌ వెస్టిండీస్‌కు భారీ షాక్ అనే చెప్పాలి. టెస్ట్ ఆడే దేశంలో నేపాల్ తొలిసారి సిరీస్‌ గెలవడంతో నేపాల్ జట్టు రికార్డ్ సృష్టించింది. పసికూనగా ఉండి మాజీ వరల్డ్ ఛాంపియన్స్‌ను ఓడించి చరిత్రకెక్కింది.

నేపాల్, వెస్టిండీస్ మధ్య జరిగిన రెండో టీ20లో నేపాల్ తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 173 పరుగులు సాధించింది. 174 పరుగుల లక్ష్యంతో వెస్టిండీస్‌ బరిలోకి దిగింది. 83 పరుగులకే వెస్టిండీస్ జట్టు కుప్పకూలింది. వారిలో జాసన్ హోల్డర్ 21 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అమీర్ జాంగూ 16 పరుగులు చేశాడు. మిగిలిన 8 మంది బ్యాట్స్‌మెన్లలో ఒక్కరు కూడా రెండంకెల స్కోరు చేయలేకపోయారు. నేపాల్ బౌలర్లు మహ్మద్ ఆదిల్ ఆలం నాలుగు వికెట్లు పడగొట్టాడు. అదే విధంగా కుశాల్ భూర్టెల్ మూడు వికెట్లు తీశాడు. ఈ విజయంతో నేపాల్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>