యంగ్ సెన్సేషన్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే (Bhagyashri Borse)కి టాలీవుడ్ లో లక్ కలిసి రావట్లేదు. యూత్ కు బాగా కనెక్ట్ అయింది కానీ హిట్ లేక ఢీలా పడింది. మిస్టర్ బచ్చన్ ఎంట్రీ ఇస్తూనే భారీ ప్లాప్ మూటగట్టుకుంది. దాని తర్వాత ఎన్నో అంచనాలతో వచ్చిన కింగ్ డమ్ మూవీ అటకెక్కింది. ఒకవేళ ఆ సినిమా హిట్ అయి ఉంటే భాగ్యశ్రీకి తిరుగు లేకుండా పోయేది. దాని తర్వాత దుల్కర్ సల్మాన్ తో గత నెలలో వచ్చిన కాంత కూడా ఆకట్టుకోలేదు. వాస్తవానికి ఆ సినిమా హిట్ అవుతుందని అంతా అనుకుంటే.. అట్టర్ ప్లాప్ అయింది. ఇక దాని తర్వాత అమ్మడి ఆశలన్నీ రామ్ తో చేసిన ఆంధ్రా కింగ్ తాలూకా సినిమా మీద పెట్టుకుంది. ఆ సినిమా ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ రెండు రోజులకే సీన్ రివర్స్ అయింది.
మూవీ ప్లాప్ దిశగా సాగుతోంది. టాక్ బాగానే ఉన్నా.. కమర్షియల్ గా హిట్ కావట్లేదు. తెలుగు రాష్ట్రాల్లో అయితే డిజాస్టర్ దారిలో నడుస్తోంది. అంతో ఇంతో ఓవర్సీస్ లోనే కలెక్షన్లు వస్తున్నాయి. ఈ మూవీ కూడా భాగ్యశ్రీ (Bhagyashri Borse)ని ఒడ్డున పడేయలేకపోయింది. ఇప్పుడు ఆమె చేతిలో అఖిల్ తో చేస్తున్న లెనిన్ మూవీ మాత్రమే ఉంది. అక్కినేని వారసుడు హిట్ కొట్టి ఎన్నో ఏళ్లు అవుతోంది. ఆ మూవీ టీజర్ పై మొన్న మంచి బజ్ క్రియేట్ అయింది.
ఒకవేళ ఆ మూవీ హిట్ అయితే భాగ్యకు అంతో ఇంతో అవకాశాలు వస్తాయి. లేదంటే మాత్రం తట్టాబుట్టా సర్దుకోవాల్సిందే. గతంలో ఇలా టాలీవుడ్ కు వచ్చి హిట్లు లేక తిరిగి బాలీవుడ్ వెళ్లిపోయిన వారిని ఎంతో మందిని చూశాం. భాగ్యశ్రీ కి ఒక్క హిట్ పడినా ఆమెకు ఇక్కడ ఛాన్సులు వస్తాయి. ఎందుకంటే యూత్ లో ఆమె అందాలకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మరి అయ్యగారు ఆదుకుంటారో లేదో చూద్దాం.
Read Also: ఫిబ్రవరిలోనే సమంత-రాజ్ ఎంగేజ్ మెంట్..?
Follow Us On: WhatsApp


