epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

రెండు టర్ములూ నేనే సీఎం.. ఢిల్లీలో రేవంత్ రెడ్డి

పదేండ్లు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అంటూ రేవంత్ రెడ్డి (Revanth Reddy) పదే పదే చెబుతున్నారు. గతంలో అనేక సభల్లో ఆయన ఇదే విషయాన్ని ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని తానే ముఖ్యమంత్రిని అవుతానని స్పష్టం చేశారు. ఈ కామెంట్లు వినీ వినీ ప్రజలకే బోర్ కొడుతోంది. అయితే సీఎం రేవంత్ రెడ్డి అత్యంత వ్యూహాత్మకంగానే ఈ కామెంట్లు చేసినట్టు కనిపిస్తోంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని ప్రధాని మోడీని కోరినట్టు చెప్పారు. గుజరాత్ సీఎంగా మోడీ ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ ఎలా సహకరించాడో ఇప్పుడూ అలాగే సహకరించాలని విజ్ఞప్తి చేసినట్టు చెప్పుకొచ్చారు. దేవుళ్లపై చేసిన కామెంట్లకు వివరణ ఇచ్చారు. ఇదే సందర్భంలో తానే రెండు టర్ములు సీఎంగా ఉంటానంటూ స్పష్టం చేశారు.

తరుచూ ముఖ్యమంత్రులను మార్చడం కాంగ్రెస్ పార్టీలో అత్యంత సహజం. అధిష్ఠానానికి కోపమొచ్చినా, విసుగొచ్చినా ముఖ్యమంత్రులను మారుస్తూ ఉంటారు. ఇటీవల కర్ణాటకలో కూడా ముఖ్యమంత్రిని మారుస్తున్నట్టు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి సిద్దరామయ్య మీడియాతో మాట్లాడుతూ.. అధిష్ఠానం డీకే శివకుమార్ ను ముఖ్యమంత్రిగా ప్రకటించవచ్చంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆ రాష్ట్రంలో సీఎం మార్పు తథ్యమేనని వార్తలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పుకు సంబంధించిన వార్త ఎప్పుడూ పెద్దగా తెరమీదకు రాలేదు కానీ కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి కంటే సీనియర్ నేతలు ఉన్నారు. ప్రస్తుతం వారు మంత్రులుగా కొనసాగుతున్నాయి. అయితే రేవంత్ రెడ్డికి ఉన్న ప్రజాదరణ, సమర్థతతను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ హైకమాండ్ ఆయనను ముఖ్యమంత్రిగా నియమించింది. ఆయనే ఈ ఐదేండ్లు ముఖ్యమంత్రిగా కొనసాగే అవకాశాలు కూడా కన్పిస్తున్నాయి.

అయితే రెండో టర్మ్ లో పరిస్థితి ఏమిటి? అన్నది అందరి మదిలో ఉన్న ప్రశ్న. తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డే (Revanth Reddy) ముఖ్యమంత్రిగా ఉంటారా? లేదంటే ఇంకో నేతకు అవకాశం ఇస్తారా? అన్న చర్చ కూడా ఉంది. ఒక వేళ కాంగ్రెస్ పార్టీ దళితుడిని ముఖ్యమంత్రిగా చేయాలని భావిస్తే మరో నేతకు అవకాశం దక్కొచ్చు. అలా కాకుండా బీసీ వాదం ప్రస్తుతం తెలంగాణలో బలంగా వినిపిస్తోంది. దీంతో బీసీ సమాజం నుంచి మరో నేతను ఎంపిక చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈ విషయంలో కొంత గందరగోళం ఉంది. కానీ రేవంత్ రెడ్డి మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా తానే మరోసారి ముఖ్యమంత్రిగా ఉంటానంటూ స్పష్టం చేశారు. మరి అధిష్ఠానం మదిలో ఏముందో వేచి చూడాలి.

Read Also: ఢిల్లీకి డీకే… పిలుపొస్తే నేనూ వెళ్తా: సిద్దూ

Follow Us on: Facebook

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>