కేంద్రంలో మోడీ గవర్నమెంట్(Modi Govt) వచ్చినప్పటి నుంచి ప్రధానంగా సెంటిమెంట్ పాలిటిక్స్ కే ప్రయారిటీ ఇస్తోంది. తీసుకొస్తున్న బిల్లులు, చేస్తున్న ప్రతి పనిలో ఆ సెంటిమెంట్ కనిపిస్తూనే ఉంది. ఇక పేర్ల మార్పుకు కొదవే లేదు. నిన్న పీఎంవో ఆఫీస్ పేరును సేవాతీర్థ్ గా మార్చడంతో మరోసారి పేర్ల మార్పుపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే కేంద్రం ఆదేశాల మేరకు అన్ని రాష్ట్రాల్లోని రాజ్ భవన్ లను లోక్ భవన్ లుగా మార్చేశారు.
ఈ పేర్ల మార్పును జాగ్రత్తగా గమనిస్తే.. మనకు ఏదైనా ఎలక్షన్ టైమ్ లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఆ ఎలక్షన్ ఉండే ప్రాంతం పేర్లను మార్చుతామని బీజేపీ నేతలు చెప్పడం మోడీ వచ్చినప్పటి నుంచి మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల దాకా మనం చూశాం. హైదరాబాద్ ను భాగ్యనగరంగా మార్చుతామని బీజేపీ ఎన్ని సార్లు చెప్పిందో వాళ్లకే తెలియదు. తెలంగాణలోనూ నిజమాబాద్ ను ఇందూరుగా, మహబూబ్ నగర్ ను సీతారామ్ నగర్ గా, కరీంనగర్ ను ఎలగందుల జిల్లాగా మారుస్తామని ఎన్నోసార్లు చెప్పారు. అయితే ఇక్కడ బీజేపీ ప్రభుత్వం రాలేదు కాబట్టి మార్చలేదనుకోండి.
కానీ దేశ వ్యాప్తంగా చాలా నగరాలు, ప్రాంతాలు, ఎయిర్ పోర్టులు, రైల్వేస్టేషన్లు, ప్రభుత్వ ఆఫీసులు, అధికారిక నివాసాలు.. ఇలా ఎన్నో పేర్లను మార్చేసింది మోడీ ప్రభుత్వం. ఎక్కువగా పార్లమెంటు ఎన్నికల సమయంలోనే పేర్ల మార్పుపై దృష్టి పెట్టింది. మోడీ ప్రభుత్వం(Modi Govt) ఇప్పటి వరకు మార్చిన పేర్లను ఓ సారి చూద్దాం.
ప్రాంతాలు:
అలహాబాద్ → ప్రయాగ్‌రాజ్ (2018)
ప్రాచీన హిందూ తీర్థయాత్ర సంప్రదాయం, త్రివేణి సంగమంతో ఉన్న సంబంధాన్ని గుర్తు చేసేలా ఈ పేరు పెట్టారు.
ఫైజాబాద్ → అయోధ్య (2018)
అయోధ్య నగరం శ్రీరామ జన్మస్థలంగా ఉన్న ప్రాంతం కాబట్టి దాన్ని దేశమంతా గుర్తించేలా మార్చారు.
హోషంగాబాద్ → నర్మదాపురం (2021)
మధ్యప్రదేశ్‌లోని పవిత్ర నర్మదా నది పేరును గుర్తించేలా పేరు మార్చారు.
ముగలసరాయి → పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నగర్ (2018)
రైల్వే పట్టణానికి ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతకర్త పేరును పెట్టారు.
రోడ్లు & ప్రజా స్థలాలు:
ఔరంగజేబ్ రోడ్ (ఢిల్లీ) → డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం రోడ్ (2015)
భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ కలాంను గౌరవిస్తూ మార్చారు.
రేస్ కోర్స్ రోడ్ (ఢిల్లీ) → లోక్ కళ్యాణ్ మార్గ్ (2016)
ప్రధాన మంత్రి నివాస మార్గం “ప్రజా సంక్షేమం” అర్థాన్ని ప్రతిబింబించేలా పేరు మార్చారు.
డల్‌హౌసీ రోడ్ (ఢిల్లీ) → దారా శికో రోడ్ (2015)
మత సామరస్యాన్ని ప్రోత్సహించిన మొఘల్ యువరాజు దారా శికోకు గుర్తుగా మార్చారు.
ప్రభుత్వ ఆఫీసులు & అధికారిక నివాసాలు:
టీన్ మూర్తి చౌక్ (ఢిల్లీ) → టీన్ మూర్తి హైఫా చౌక్ (2018)
1918లో భారత సైనికులు పోరాడిన హైఫా యుద్ధాన్ని స్మరించేందుకు పేరు మార్చారు.
రాజ్‌పథ్ (ఢిల్లీ) → కర్తవ్య పథ్ (2022)
రాజుల వారసత్వాన్ని తొలగిస్తూ “కర్తవ్య భావన”ను ప్రతిబింబించేలా పేరు మార్చారు.
ఇతర సంస్థలు:
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (అలహాబాద్) → ఎన్ఐటి ప్రయాగ్‌రాజ్ (2018)
నగర నూతన పేరుతో అనుసంధానం చేస్తూ మార్చారు.
వివిధ రైల్వే స్టేషన్లు:
ముగలసరాయి జంక్షన్ → పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ (2018)
హబీబ్‌గంజ్ (భోపాల్) → రాణి కమలాపతి స్టేషన్ (2021) – గోండ్ రాణికి గుర్తుగా మార్చారు.
వీటన్నింటినీ బట్టి చూస్తుంటే.. బ్రిటిష్ కాలపు పేర్లు అయిన రాజ్‌పథ్, రేస్ కోర్స్ రోడ్ లాంటి వాటిని తొలగించారు. కొత్త పేర్లను చూస్తే హిందూ వారసత్వాన్ని, సంస్కృతిని ప్రతిబింబించేలా ప్రయాగ్‌రాజ్(Prayagraj), అయోధ్య(Ayodhya) లాంటి పేర్లను తీసుకొచ్చారు. కలాం, దీన్ దయాళ్ ఉపాధ్యాయ, రాణి కమలాపతి లాంటి పేర్లను చూస్తే నాయకులకు గౌరవం ఇచ్చినట్టు మనకు కనిపిస్తోంది. ఇలా పేర్లు మార్చడం బీజేపీకి చాలా సార్లు ప్లస్ అయింది కూడా. మరి ఇప్పుడు పీఎంవో ఆఫీస్ పేరు మార్చడం వెనక వ్యూహమేంటో వేచి చూడాలి.
Read Also: పవన్… జాగ్రత్తగా మాట్లాడు… కవిత కౌంటర్
Follow Us on: Facebook


