ఆంధ్ర డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్(Pawan Kalyan)పై తెలంగాణ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి(MLA Anirudh Reddy) మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలను ఇంకా ఎందుకు క్షమాపణ చెప్పలేదని ప్రశ్నించారు. పవన్ క్షమాపణ చెప్పే వరకు జడ్చర్లలో అతని సినిమా ఒక్కటి కూడా ఆడదని హెచ్చరించారు. తెలంగాణ ప్రజలు ఏం పీకలేరని అనుకుంటే తప్పని, తామేం చేయగలమో చూపిస్తామని అన్నారు. తెలంగాణ ప్రజలను రాక్షసులతో పోల్చడం సరికాదని అన్నారు. తెలంగాణ పౌరుషం ఉన్న ప్రతి ఒక్కరూ పవన్ మాటలను ఖండించాలని కోరారు అనిరుధ్ రెడ్డి. తాను పవన్ అభిమానినే అయినా తెలంగాణ ప్రజలను చులకన చేస్తా అంటే ఊరుకునేది లేదని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే కోణసీమ(Konaseema) జిల్లా పర్యటనలో పవన్ చేసిన వ్యాఖ్యలపై అనిరుధ్ రెడ్డి(MLA Anirudh Reddy) ఒకసారి ఘాటుగా స్పందించారు. దమ్ముంటే ఏపీలో ఒంటరిగా పోటీ చేసి చూపాలన్నారు. చిరంజీవి లేకపోతే పవన్‌ను ఏ ఒక్కరూ పట్టించుకునేవారు కాదని అన్నారు. చిత్తశుద్ధ ఉంటే హైదరాబాద్‌లోని ఆస్తులను అమ్మేయాలని ఛాలెంజ్ చేశారు.
Read Also: పవన్ వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ నేతల మౌనం
Follow Us On: Instagram


