అతి త్వరలోనే జీహెచ్ఎంసీ(GHMC)లో పెద్ద మార్పు జరగబోతోంది. డివిజన్ల డీలిమిటేషన్ కు ప్లాన్ రెడీ అయింది. ఓఆర్ ఆర్ లోపల ఉన్న 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు విలీనం అవుతున్న సంగతి తెలిసిందే. అదే జరిగితే మొత్తం డివిజన్లు 306కు చేరుతాయి. ఈ డివిజన్లు 10 నుంచి 12 జోన్లుగా డివైడ్ అవుతాయి. సర్కిళ్ల సంఖ్య కూడా పెరుగుతుంది. మొన్న కేబినెట్ లో దీనికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు త్వరలోనే డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఇవ్వడానికి ఓకే చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత దీన్ని ఫైనల్ చేయబోతున్నారు. వారం తర్వాత ఫైనల్ నోటిఫికేషన్ రాబోతోంది.
గవర్నర్ ఆర్డినెన్స్ కు ఓకే చేసిన వెంటనే ఈ 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు జీహెచ్ఎంసీ(GHMC)లో విలీనం అయిపోతాయి. ఆ వెంటనే డివిజన్ల హద్దులు పూర్తిగా మారిపోతాయి. ఇప్పుడు కొత్తగా చేరుతున్న మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో కొత్త డివిజన్ల ఏర్పాటు అవుతాయి. ఇప్పటి వరకు హైదరాబాద్ కు ఉన్న 150 డివిజన్ల సరిహద్దులు పూర్తిగా మారిపోయి కొత్త హద్దులు క్రియేట్ అవుతాయి. ఇప్పటి వరకు ఒక డివిజన్ ఒక సర్కిల్ పరిధిలో లేవు. చాలా డివిజన్లు రెండు సర్కిళ్ల పరిధిలో ఉన్నాయి. దీని వల్ల ఎన్నో రకాల పాలనా పరమైన సమస్యలు వస్తున్నాయి.
శానిటేషన్, కరెంట్, నీటి సరఫరా, రోడ్లు, మున్సిపల్ సేవల కోసం డివిజన్ల ప్రజలు రెండు సర్కిళ్ల చుట్టూ తిరగాల్సి వస్తోంది. ఇకపై అలా జరగకుండా డివిజన్ల హద్దులపై జీహెచ్ఎంసీ స్పష్టమైన మ్యాప్ తీసుకుంది. ప్రతీ డివిజన్ ఒకే సర్కిల్ పరిధిలో ఉండేలా, ప్రతీ సర్కిల్ ఒకే జోన్ పరిధిలో ఉండేలా అధికారులు ప్లాన్ రెడీ చేశారు. విలీనం అయిన వెంటనే జోన్లకు విస్తృతాధికారాలు వెళ్లబోతున్నాయి. హైదరాబాద్ ను గ్లోబల్ సిటీగా మార్చే క్రమంలోనే పాలనా పరమైన సమస్యలు రాకుండా ఇలా మార్చేస్తున్నారు. ఇంతకు ముందు ప్రజలు ప్రతి చిన్న అవసరానికి జీహెచ్ఎంసీకి రావాల్సి వచ్చేది.
దాని వల్ల టైమ్ వేస్ట్ కావడమే కాకుండా పనులు టైమ్ కు జరగట్లేదు. కాబట్టి జోన్ల సంఖ్య పెరిగాక ఈ సమస్య మరింత పెరగొద్దని అధికార వికేంద్రీకరణ చేస్తున్నారు. ఎవరైనా బిల్డింగ్ కట్టుకుంటే జోనల్ పరిధిలోనే 7 అంతస్తులకు పర్మిషన్స్ ఇచ్చేలా జోనల్ కమిషనర్లకు స్పెషల్ పవర్స్ ఇవ్వబోతున్నారు. హెచ్ఎండీఏ ప్రాంతం జీహెచ్ఎంసీలో కలుస్తుండడంతో ఆదాయం పెరిగే ఛాన్స్ ఉంది. వచ్చే ఏడాది మార్చి చివరికల్లా ఈ మొత్తం ప్రక్రియను పూర్తి చేయాలనే ఆలోచనలో రేవంత్ ప్రభుత్వం ఉంది. ఈ డివిజన్ల హద్దులు మారాక ప్రజలు కూడా ఏ సమస్యకు అయినా డివిజన్ ఆఫీస్ కు వెళ్తే సరిపోతుంది. దీంతో పాలనా పరమైన చిక్కులన్నీ క్లియర్ అయిపోతాయి.
Read Also: హిందూ దేవుళ్లపై రేవంత్ కామెంట్స్.. నెటిజన్ల ఫైర్
Follow Us On: instagram


