epaper
Friday, January 16, 2026
spot_img
epaper

మళ్లీ నోరుజారిన రాజేంద్రప్రసాద్

సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్(Rajendra Prasad) గత కొన్ని రోజులుగా వేదికల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. గతంలో కొన్ని సినిమా ఈవెంట్లలో ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి. తాజాగా మరోసారి అటువంటి కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు. ‘సకుటుంబానాం’ ట్రైలర్ రిలీజ్ వేడుకలో చేసిన వ్యాఖ్యలతో ఇండస్ట్రీలో చర్చనీయాంశం అయ్యాయి.

ఈవెంట్‌కు బ్రహ్మానందం(Brahmanandam), దర్శకుడు బుచ్చిబాబు సానా, రాజేంద్ర ప్రసాద్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కుటుంబ భావోద్వేగాలతో నిండిన ఈ సినిమా ట్రైలర్ అందరి మెప్పు పొందింది. అయితే ట్రైలర్ తర్వాత జరిగిన స్పీచ్ సెషన్‌లో రాజేంద్ర ప్రసాద్ ప్రవర్తనే చర్చనీయాంశమైంది.

బ్రహ్మానందం మాట్లాడడం ముగిసిన వెంటనే రాజేంద్ర ప్రసాద్ మైక్ అందుకొని బ్రహ్మానందాన్ని ఉద్దేశించి “ముసలి ముంకొడకా” అంటూ కామెంట్ చేశారు. అక్కడున్న ప్రేక్షకులు, ఆర్టిస్ట్‌లు కాసేపు షాక్ అయ్యారు. బ్రహ్మానందం కూడా అతని వైపుకు తిరిగి ఎవరు అన్నట్టు చూసారు. వెంటనే “నేనే” అంటూ నవ్వుతూ రాజేంద్ర ప్రసాద్(Rajendra Prasad) ఆ మాటని ఫన్నీగా మార్చుకునే ప్రయత్నం చేశారు. ఆ ఈవెంట్ లైవ్ కావడంతో విషయం అందరికీ అర్థం అయ్యింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ రాజేంద్రప్రసాద్ కామెంట్లు వైరల్ అయ్యాయి.

ఇటీవల రాబిన్ హుడ్ మూవీ ఈవెంట్‌లో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌పై ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన విషయం తెలిసిందే. అలాగే ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలో అలీ గురించి చెప్పిన మాటలు కూడా పెద్ద చర్చకు దారి తీశాయి. ప్రతి సారి ఆయన వాటిని ‘ఫన్ కామెడీ’గా సమర్థించుకొనే ప్రయత్నం చేసినప్పటికీ, ప్రేక్షకుల్లో మాత్రం వెగటు భావన కలుగుతోంది.

ఇప్పుడు బ్రహ్మానందం పేరుతో మాట్లాడిన ఈ వ్యాఖ్యతో మళ్లీ అదే వాతావరణం ఏర్పడింది. అంతటి సీనియర్ నటుడు, తాను నిలబెట్టుకున్న గౌరవానికి భిన్నంగా ఇలాంటి మాటలు మాట్లాడటం ఇండస్ట్రీలో కూడా ఆశ్చర్యంగా భావిస్తున్నారు. అయితే బ్రహ్మానందం ఈ కామెంట్లను స్పోర్టివ్ గానే తీసుకున్నట్టు కనిపించింది. కానీ సీనిప్రియులు, ప్రేక్షకులు రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలతో నిత్యం నొచ్చుకుంటూనే ఉన్నారు. మరి ఆయనలో ఈ అసహనం ఎందుకు పెరిగింది? వయసువల్ల వచ్చిన చాదస్తమా? లేక మానసికంగా ఇబ్బంది పడుతున్నారా? అన్నది వేచి చూడాలి. ఓ దశలో ఆయనను సినిమా ఫంక్షన్లకు పిలవాలంటనే నిర్వాహకులు భయపడే పరిస్థితి వచ్చింది.

Read Also: ‘కాంతార’ రణ్‌వీన్ కామెంట్.. మండిపడుతున్న కన్నడిగులు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>