Mobile Popup Ad
Mobile Popup Ad

అన్నదాతలను అనామకులను చేస్తున్న కూటమి సర్కార్: బొత్స

కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ(Botsa Satyanarayana) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం పెట్టే రైతులను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. రాష్ట్రంలో రైతుల పరిస్థితి అగమ్యగోచారంగా మారిందని, వారి బాధలు వినేవారు, సమస్యలు పరిష్కరించేవారే రాష్ట్రంలో కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆఖరికి రైతులకు కావాల్సిన ఎరువులను కూడా కూటమి ప్రభుత్వం అందించడం లేదని, అందువల్ల బ్లాక్ మార్కెట్‌లో ఎరువులు కొని పంటలు పండించాల్సిన దుర్భర పరిస్థితుల్లో రైతులు ఉన్నారని ఆయన అన్నారు.

పంట చేతికి వచ్చే సమయానికి ప్రకృతి వైపరిత్యాలు వచ్చి నష్టాన్ని మిగులుస్తున్నాయని, వారికి ఆదుకోవాలన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేదని ఆయన అన్నారు. రైతులకు ఎప్పుడు సాయం చేస్తారో కూటమి నేతలు చెప్పాలి? అని బొత్స(Botsa Satyanarayana) డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ సంస్థలకు చంద్రబాబు భూములు కట్టబెడుతున్నారని విమర్శించారు. ప్రజల ఆస్తులను, ప్రజా ధనాన్ని కారు చౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెడుతున్నారు ఆరోపించారు.

Read Also: మూడు జోన్‌లుగా ఏపీ.. విభజన ఎలా అంటే..

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>