epaper
Thursday, March 5, 2026
epaper

తెలంగాణ IPS కు అమిత్ షా బంపర్ ఆఫర్

కలం, తెలంగాణ బ్యూరో : ‘ఆపరేషన్ కగార్’లో తెలంగాణ పోలీసు శాఖకు ప్రత్యేక గుర్తింపు లభించింది. చత్తీస్‌గఢ్ తరహాలో ఎన్‌కౌంటర్లు లేవు.. రక్తం చిందలేదు.. ఇరువైపులా ప్రాణనష్టం లేదు.. కానీ సుమారు 600 మంది మావోయిస్టు సభ్యులు లొంగిపోయారు. ఇందులో పదుల సంఖ్యలో అగ్ర నేతలు కూడా ఉన్నారు. వందల సంఖ్యలో ఆయుధాలు కూడా పోలీసులకు స్వాధీనమయ్యాయి. చత్తీస్‌గఢ్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ఎన్‌కౌంటర్లు జరుగుతున్నా తెలంగాణలో ఇందుకు భిన్నమైన పరిస్థితుల్లో ఫలితాలు రావడం కేంద్ర హోంశాఖ స్థాయిలోనే చర్చనీయాంశమైంది. తెలంగాణ గడ్డ మీద 1970వ దశకంలో పీపుల్స్ వార్ పేరుతో మొదలైన వామపక్ష తీవ్రవాదం చివరకు గడ్డ మీద నుంచే అంతమయ్యే పరిస్థితి నెలకొన్నది. పార్టీలో కేంద్రకమిటీ, పోలిట్‌బ్యూరో లాంటి ఉన్నతస్థాయిలోని నేతలు సైతం తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోవడం గమనార్హం. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. ఈ ఆపరేషన్ లో చాకచక్యంగా వ్యవహరించిన ఓ తెలంగాణ ఐపీఎస్ ఆఫీసర్ (Telangana IPS Officer) కి కేంద్ర హోంమంత్రి ఓ ఆఫర్ ఇచ్చినట్టు విశ్వసనీయ సమాచారం.

ఇక్కడి ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఐబీకి :

ఆపరేషగన్ కగార్‌తో పాటు మావోయిస్టుల సరెండర్‌లో కీలక భూమిక పోషించిన తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ (Telangana IPS) ఒకరు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరోలోకి వెళ్ళనున్నారు. ఈ ఆఫీసర్ చూపిన ప్రతిభను స్వయంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రశంసించారు. మావోయిస్టుల కదలికలను పసిగట్టడం, టెక్నాలజీ సాయంతో వారితో టచ్‌లో ఉన్నవారిని గుర్తించడం, దానికి అనుగుణంగా లొంగిపోయేలా మైండ్‌సెట్‌ను ఫిక్స్ చేయడం, వారి ప్రభావంతో మరికొందరిని సరెండర్ బాటలోకి తీసుకురావడం.. ఇలాంటివన్నీ నైపుణ్యంతో, భిన్నమైన ఆలోచనతో అమలు చేయడం అమిత్ షా (Amit Shah) దృష్టిని ఆకర్షించింది. ఆపరేషన్ కగార్ ఈ నెలాఖరుతో ముగుస్తున్నందున తదుపరి యాక్షన్ ప్లాన్ కోసం ఆ ఆఫీసర్‌ను సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరోలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఇదే అభిప్రాయాన్ని తెలంగాణ ప్రభుత్వానికి వివరించినట్లు తెలిసింది. దీనికి సానుకూల స్పందన రావడంతో ఏప్రిల్ నుంచి ఎప్పుడైనా ఆ ఆఫీసర్ సెంట్రల్ ఐబీలోకి డిప్యూటేషన్‌పై వెళ్ళే అవకాశమున్నది.

తెలంగాణ ఇంటెలిజెన్స్ వ్యూహం ప్రత్యేకం :

ఒకప్పుడు యాంటీ నక్సల్ స్క్వాడ్, గ్రేహౌండ్స్ లాంటి ప్రత్యేక విభాగాలు మావోయిస్టులను ఎదుర్కొనేందుకు పుట్టకొచ్చినవే. అడవులను జల్లెడపట్టే కూంబింగ్‌ స్ట్రాటెజీ, గెరిల్లా వార్‌ఫేర్ మెలకువలు, దానికి తగినట్లు శారీరక ఫిట్‌నెస్.. ఇలాంటివన్నీ ఈ రెండు విభాగాల ప్రత్యేకతలు. అదే తరహాలో మావోయిస్టు పార్టీ ఊహకు కూడా అందని తీరులో ఇన్‌ఫార్మర్ నెట్‌వర్క్, కోవర్ట్ మెకానిజం అమలు, సానుభూతిపరుల గుర్తింపు, లాజిస్టిక్స్-మెడిసిన్ సప్లై చెయిన్‌ను ఐడెంటిఫై చేయడం.. ఇలాంటివన్నీ తెలంగాణా ఇంటెలిజెన్స్ పోలీసుల ఎత్తుగడల్లో కొన్ని. ఇలాంటివన్నీతెలంగాణలో మావోయిస్టు ఉద్యమం బలహీనపడడానికి, కనుమరుగు కావడానికి దోహదపడ్డాయి. ఇప్పుడు ఆపరేషన్ కగార్‌ (Operation Kagar) అమల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ తనదైన శైలిలో వ్యవహరించి కేంద్ర ఐబీతో పాటు పొరుగు రాష్ట్రాల పోలీసు విభాగాలకు కూడా సమాచారం ఇవ్వగలిగింది. ఇప్పుడు ఆ విభాగానికి చెందిన ఆఫీసర్‌ను సెంట్రల్ ఐబీలో నియమించాలని కేంద్ర హోంశాఖ భావిస్తున్నది.

ఆపరేషన్ కగార్‌తో 600 మంది సరెండర్ :

కేంద్ర ప్రభుత్వం 2024 జనవరి 1న ‘ఆపరేషన్ కగార్’ను ప్రారంభించిన తర్వాత చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి, డీజీపీ, పోలీసుల ముందు లొంగిపోయినవారి సంఖ్య ఎలా ఉన్నప్పటికీ తెలంగాణలో మాత్రం ఈ రెండేండ్ల కాలంలో 591 మంది మావోయిస్టు పార్టీ లీడర్లు, కేడర్ లొంగిపోయారు. ఇందులో కేంద్రకమిటీ సభ్యులు, పోలిట్‌బ్యూరో సభ్యులు, స్పెషల్ జోనల్ కమిటీ సెక్రటరీలు, సభ్యులు, డివిజినల్ కమిటీ కార్యదర్శులు, సభ్యుల మొదలు పార్టీ సభ్యులు, దళ సభ్యుల వరకు వివిధ స్థాయిల్లోని వారు ఉన్నారు. ఆపరేషన్ కగార్ ప్రారంభించిన మొదటి సంవత్సరంలో కేవలం 47 మంది లొంగిపొతే గతేడాది గరిష్టంగా 509 మంది, ఈ రెండు నెలల్లో 35 మంది లొంగిపోయారు. ఇప్పటివరకు ఈ లొంగుబాట్ల ద్వారా ప్రభుత్వానికి దాదాపు 150 ఆయుధాలు స్వాధీనమయ్యాయి.

రక్తం చిందకుండా సక్సెస్‌ఫుల్ సరెండర్స్ :

చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఒడిశా లాంటి రాష్ట్రాల్లో ఎన్‌కౌంటర్లు జరుగుతున్నా తెలంగాణలో మాత్రం ఆపరేషన్ కగార్‌లో ఒక్క ఎన్‌కౌంటర్ కూడా లేకుండా సరెండర్ల కోసం పోలీసులు ప్రయత్నించడం కేంద్ర ప్రభుత్వాన్ని ఆకట్టుకున్నది. ఒకప్పుడు పాతికమందితో కూడిన మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీలో దాదాపు మూడొంతుల మంది తెలంగాణా ప్రాంతానికి చెందినవారే. ఇప్పుడు కేవలం ముగ్గురికి పరిమితమైన సీసీలో గణపతి, నరహరి అనే ఇద్దరు మాత్రమే తెలంగాణకు చెందినవారు. మరొకరు జార్ఖండ్ రాష్ట్రానికి చెందినవారు. సీసీ సభ్యులు దేవ్‌జీ, మల్లా రాజిరెడ్డి, పుల్లూరి ప్రసాదరావు తదితర చాలా మంది తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. ప్రస్తుతం తెలంగాణకు చెందినవారు తొమ్మిది మంది మాత్రమే జిల్లాస్థాయి నాయకులు ఉన్నారు. వీరు కూడా ఈ నెల చివరికల్లా లొంగిపోతారన్నది పోలీసుల భావన.

తెలంగాణ ఇంటెలిజెన్స్ వ్యూహం ప్రత్యేకం :

ఒకప్పుడు యాంటీ నక్సల్ స్క్వాడ్, గ్రేహౌండ్స్ లాంటి ప్రత్యేక విభాగాలు మావోయిస్టులను ఎదుర్కొనేందుకు పుట్టకొచ్చినవే. అడవులను జల్లెడపట్టే కూంబింగ్‌ స్ట్రాటెజీ, గెరిల్లా వార్‌ఫేర్ మెలకువలు, దానికి తగినట్లు శారీరక ఫిట్‌నెస్.. ఇలాంటివన్నీ ఈ రెండు విభాగాల ప్రత్యేకతలు. అదే తరహాలో మావోయిస్టు పార్టీ ఊహకు కూడా అందని తీరులో ఇన్‌ఫార్మర్ నెట్‌వర్క్, కోవర్ట్ మెకానిజం అమలు, సానుభూతిపరుల గుర్తింపు, లాజిస్టిక్స్-మెడిసిన్ సప్లై చెయిన్‌ను ఐడెంటిఫై చేయడం.. ఇలాంటివన్నీ తెలంగాణా ఇంటెలిజెన్స్ పోలీసుల ఎత్తుగడల్లో కొన్ని. ఇలాంటివన్నీతెలంగాణలో మావోయిస్టు ఉద్యమం బలహీనపడడానికి, కనుమరుగు కావడానికి దోహదపడ్డాయి. ఇప్పుడు ఆపరేషన్ కగార్‌ అమల్లో తెలంగాణ ఇంటెలిజెన్స్ తనదైన శైలిలో వ్యవహరించి కేంద్ర ఐబీతో పాటు పొరుగు రాష్ట్రాల పోలీసు విభాగాలకు కూడా సమాచారం ఇవ్వగలిగింది. ఇప్పుడు ఆ విభాగానికి చెందిన ఆఫీసర్‌ను సెంట్రల్ ఐబీలో నియమించాలని కేంద్ర హోంశాఖ భావిస్తున్నది.

Read Also: గణపతి లొంగుబాటు వేళ ఆడియో వైరల్

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!