epaper
Thursday, March 5, 2026
epaper

టోలిచౌకిలో ఘోర ప్రమాదం: ముగ్గురు దుర్మరణం

కలం, వెబ్​ డెస్క్​ : హైదరాబాద్ టోలిచౌకి (Tolichowki) ప్రాంతంలో గురువారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఒక ఐదు అంతస్తుల భవనంపై పనులు నిర్వహిస్తుండగా గోవా కర్రెలతో ఏర్పాటు చేసిన తాత్కాలిక నిర్మాణం ఒక్కసారిగా విరిగిపోవడంతో ఈ విషాదం సంభవించింది. భవనంపై నిలబడి పనులు చేస్తున్న కార్మికులు ఎత్తు నుండి నేరుగా కిందపడిపోవడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో మరో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడగా వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే తోటి కార్మికులు, స్థానికులు స్పందించి గాయపడిన వారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

కొత్తగా నిర్మిస్తున్న ఈ భవనానికి సంబంధించి పై అంతస్తుల పనుల కోసం గోవా కట్టెలను తాత్కాలికంగా అమర్చారు. అయితే పనులు జరుగుతున్న సమయంలో ఆ సామగ్రి అకస్మాత్తుగా విరిగిపోవడంతో పైన ఉన్న వారు తప్పించుకునే లోపే ప్రమాదం జరిగిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Read Also: రీల్​కు రూ.80వేలు.. బెంగాల్​లో ఇన్​ఫ్లుయెన్సర్లకు డిమాండ్​​​​

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!