epaper
Thursday, March 5, 2026
epaper

మరో మూడు దేశాలకు పాకిన యుద్ధం

కలం, వెబ్​ డెస్క్​: పశ్చిమాసియాలో యుద్ధం(Middle East War) మరింత విస్తరిస్తోంది. గురువారం ఆరో రోజు మరో మూడు దేశాలకు పాకింది. ఈ ఉదయం అజర్​బైజాన్​ రాజధాని బాకులోని అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్​ డ్రోన్లతో దాడి చేసింది. ఈ ఘటనలో ఎంత మంది మరణించిందీ తెలియరాలేదు. ఈ దాడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అజర్​బైజాన్​.. తమ దేశంలోని ఇరాన్​ రాయబారికి సమన్లు ఇచ్చింది. అజర్​బైజాన్​పై దాడికి కారణాలను ఇరాన్​ వెల్లడించలేదు.

మరోవైపు టర్కీ, ఇరాక్​పైనా డ్రోన్లు, బాలిస్టిక్​ మిస్సైళ్లతో ఇరాన్​ దాడికి దిగింది. యుద్ధంలో అమెరికాకు సహాయం చేస్తామని ఇరాక్​కు చెందిన కుర్దిష్​ దళాలు ప్రకటించడంతో ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఇక, ఇరాన్ బాలిస్టిక్​ క్షిపణి తమ దేశంపై చొచ్చుకొచ్చిందని, భద్రతా దళాలు దానిని పేల్చేశాయని టర్కీ వెల్లడించింది. నాటో సభ్యదేశంపై దాడికి దిగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించింది. అయితే, ఈ ఆరోపణను ఇరాన్​ ఖండించింది. తాము టర్కీ మీద మిస్సైళ్లు ప్రయోగించలేదని స్పష్టం చేసింది.

ఖతార్​, కువైట్​, యూఏఈపై..

అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా గురువారం సైతం ఖతార్​, కువైట్​, యూఏఈపై ఇరాన్​ మిస్సైళ్లతో విరుచుకుపడింది. దోహాలోని విమానాశ్రయంపై డ్రోన్లు దాడి చేశాయి. దుబాయ్​, అబుదాబి, కువైట్​లోనూ ఇరాన్​ దాడులు కొనసాగుతున్నాయి.

మా సైనికులు ఆరుగురు చనిపోయారు : యూఎస్​

ఇరాన్​తో యుద్ధంలో (Middle East War) ఇప్పటివరకూ తమ సైనికులు ఆరుగురు చనిపోయినట్లు వాషింగ్టన్​లోని అమెరికా ప్రభుత్వ ప్రధాన కార్యాలయం పెంటగాన్​ వెల్లడించింది. కువైట్​లో ఇరాన్​ డ్రోన్​ దాడిలో వీళ్లు మరణించినట్లు తెలిపింది. ఇందులో మేజర్​ జెఫ్రీ ఓబ్రియన్(45)​, కెప్టెన్​ కాడీ ఖోర్క్(35), నికోల్ అమోర్​(39), నోవా తియోత్సెన్స్​(42), డెక్లాన్​ కాడీ(20) చనిపోయారని పేర్కొంది. చనిపోయిన మరో సైనికుడి వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించింది. ​

Read Also: తెలంగాణ IPS కు అమిత్ షా బంపర్ ఆఫర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!