Mobile Popup Ad
Mobile Popup Ad

టారిఫ్ ల సొమ్ము రిఫండ్ చేయాలి.. ట్రంప్ కు ట్రేడ్ కోర్టు షాక్

కలం, వెబ్ డెస్క్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు (Donald Trump) న్యూయార్క్ ట్రేడ్ కోర్టు షాక్ ఇచ్చింది. ప్రపంచ దేశాలపై వేసిన అదనపు టారిఫ్ ల ద్వారా వచ్చిన సొమ్మును రిఫండ్ చేయాల్సిందే అంటూ ఆదేశించింది ట్రేడ్ కోర్టు. ఇతర దేశాల వస్తువులను దిగుమతి చేసుకున్న సంస్థలు రిఫండ్ పొందేందుకు అర్హులు అంటూ చెప్పింది న్యూయార్క్ ట్రేడ్ కోర్టు. అట్మస్ ఫిల్ట్రేషన్ అనే సంస్థ దాఖలు చేసిన పిటిషన్ విచారించిన ట్రేడ్ కోర్టు.. ఈ ఆదేశాలు జారీ చేసింది. రిఫండ్ కు సంబంధించిన వ్యవహారాలను ట్రేడ్ కోర్టు న్యాయమూర్తి రిచర్డ్ ఈటన్ వెల్లడించారు. ఈ ఆదేశాలపై ట్రంప్ (Donald Trump) బృందం స్పందించింది. తీర్పుపై అప్పీలుకు వెళ్తామని చెప్పింది.

గత నెలలో అమెరికా సుప్రీంకోర్టు ట్రంప్ వేసిన అదనపు టారిఫ్ లను కొట్టేసింది. ట్రంప్ టారిఫ్ లు చట్టబద్ధం కాదని తేల్చి చెప్పింది. టారిఫ్ లు ద్వారా వచ్చిన సొమ్మును తిరిగి ఇచ్చేయాలని అప్పుడే సుప్రీంకోర్టు తెలిపింది. కానీ సుప్రీం తీర్పును ట్రంప్ లెక్క చేయలేదు. మళ్లీ దేశాలపై టారిఫ్‌ లు విధిస్తూనే ఉన్నాడు. టారిఫ్‌ సొమ్మును కూడా తిరిగి ఇవ్వట్లేదు. సుప్రీం తీర్పుపైనే ట్రంప్ మండిపడ్డారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>