కలం, వెబ్ డెస్క్: ఏపీ శాసన మండలి (AP Council)లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు (BR Naidu)ను పదవి నుంచి తొలగించాలని వైసీపీ (YSRCP) వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. ఇటీవల బీఆర్ నాయుడు ఓ మహిళతో చనువుగా ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలపై వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ నాయుడు వెంటనే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చివరికి బీఆర్ నాయుడు ప్రెస్‌మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. ఆ వీడియోలో ఉన్నది తమ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని, దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. మరోవైపు వైసీపీ అధినేత వైఎస్ జగన్ జగన్ సైతం దీనిపై ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. సీఎం చంద్రబాబుకు దైవ భక్తి లేదని, ఇలాంటి వారికి పదవులు కట్టబెట్టారని విమర్శించారు. బీఆర్ నాయుడు వివరణ ఇచ్చిన సోషల్ మీడియాలో ఈ దుమారం ఆగలేదు. దీంతో నేడు మండలిలో వైసీపీ సభ్యులు మాధవరావు, వరుదు కళ్యాణి, భరత్ వాయిదా తీర్మానం అందజేశారు. ఈ అంశంపై చర్చ జరగాలని, టీటీడీ చైర్మన్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు.

