epaper
Wednesday, March 4, 2026
epaper

సంజు మేనియా.. కేరళలో భారీ కటౌట్‌తో అభిమానుల సందడి

కలం, వెబ్ డెస్క్: వెస్టిండీస్‌తో జరిగిన టీ20 వరల్డ్ కప్ 2026 సూపర్-8 కీలక పోరులో స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ (Sanju Samson)  తన అద్భుత ప్రదర్శనతో భారత్‌ను సెమీఫైనల్‌కు చేర్చాడు. సంజు కేవలం 50 బంతుల్లోనే 12 ఫోర్లు, 4 సిక్సర్లతో అజేయంగా 97 పరుగులు చేశాడు. టీమిండియా ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్ ఆడి విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంజుకు సొంత రాష్ట్రమైన కేరళ (Kerala)లో ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం వెలుపల అభిమానులు సంజు భారీ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!