epaper
Tuesday, March 3, 2026
epaper

పాక్​ను సామంత రాజ్యంగా మార్చాలనే కుట్రలో భారత్​ : ఖవాజా ఆసిఫ్​

కలం, వెబ్​ డెస్క్​: అర్థం పర్థంలేని తన మాటలతో పలుసార్లు నవ్వులపాలైన పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్​(Khawaja Asif) మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు. పాకిస్థాన్​ను సామంత రాజ్యంగా మార్చుకోవాలని ఇజ్రాయెల్​, భారత్​ కుట్ర చేస్తున్నాయని వింత వాదన తెచ్చారు. ఈ మేరకు మంగళవారం తన ఎక్స్​ ఖాతాలో ఒక పోస్ట్ ట్వీట్​​ చేశారు. షరా మామూలుగానే భారత్​పై విషం కక్కారు.

ఇరాన్​తో పాకిస్థాన్​కు దాదాపు 900 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్​ రెండు రోజుల నుంచి ఆఫ్ఘనిస్థాన్​తో బహిరంగ యుద్ధం చేస్తోంది. అదే క్రమంలో స్వదేశంలో బెలూచిస్థాన్​ లిబరేషన్​ ఆర్మీ(బీఎల్ఏ) స్వతంత్రం కోసం పోరాడుతూ పాక్​కు కంట్లో నలుసుగా మారింది. ఈ క్రమంలో ఇరాన్​ను యుద్ధంలో ఓడించడం ద్వారా పట్టు సాధించి, భారత్​, ఆఫ్ఘనిస్థాన్​లతో కలసి ఒక కూటమిగా మారాలని ఇజ్రాయెల్​ ప్లాన్​ చేస్తోందని ఆసిఫ్​ ఆరోపించారు. ఈ మూడు దేశాలు ఇరాన్​ను తమ ఆధీనంలోకి తెచ్చుకొని, బెలూచిస్థాన్​ ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నాయని, ఆ తర్వాత పాక్​ను సామంత రాజ్యంగా మార్చుకోవాలని ప్లాన్ వేస్తున్నాయని వితండవాదం చేశారు.

ఇజ్రాయెల్​ దేశం ఏర్పడినప్పటి నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇస్లాంను అంతం చేయడానికి ప్రయత్నిస్తోందని ఖవాజా ఆసిఫ్(Khawaja Asif)​ ఆరోపించారు. అందులో భాగంగానే ప్రపంచవ్యాప్తంగా ముస్లిం దేశాలపై యూదు జాతి(ఇజ్రాయెలీలు) ద్వేష పూరితంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. దీనిని ఎదుర్కోవడానికి ముస్లిం దేశాలన్నీ ఒక్కటి కావాలని చెప్పారు. పాకిస్థాన్​లోని ప్రజలందరూ ఇజ్రాయెల్​ వ్యతిరేకంగా గళం విప్పాలని రెచ్చగొట్టేలా తన ట్వీట్​లో పోస్ట్​ చేశారు.

కాగా, ఇరాన్​ అధ్యక్షుడు అయతొల్లా ఖమేనీ హత్య అనంతరం పాకిస్థాన్​లోని అమెరికా ఎంబసీపై ఆందోళనకారులు దాడికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అమెరికా సైన్యం కాల్పుల్లో 20మందికిపైగా మరణించారు. అంతేకాదు, రెండు రోజులుగా పాక్​లో ఇరాన్​కు మద్దతుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో అగ్నికి ఆజ్యం పోసేలా ఖవాజా ఆసిఫ్​ ‘ఎక్స్​’లో ట్వీట్​ చేయడం ప్రజల్ని మరింత రెచ్చగొట్టడానికేనని భావిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!