ఆర్టీసీ హమాలీల కూలీ రేట్లను పెంచాలి: ఏఐటీయూసీ

కలం, మహబూబ్‌‌నగర్ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీలో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న హమాలీ కార్మికులకు (Hamali Workers) సరైన కూలీ రేట్లు అందడం లేదని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి పి. సురేశ్ అన్నారు. ఆర్టీసీ హమాలీ కార్మికులకు తక్షణమే ప్రభుత్వం కూలిరేట్లను పెంచాలని డిమాండ్ చేశారు. సోమవారం మహబూబ్‌నగర్ ఆర్టీసీ బస్టాండు ప్రాంగణంలో ఆర్టీసీ హమాలీ కార్మికుల రాష్ట్ర మహాసభల డిమాండ్స్ పత్రం ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పి.సురేశ్ మాట్లాడుతూ.. ఏళ్ల తరబడి ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల సరుకులు చేరవేస్తూ హమాలీలు సేవలు అందిస్తున్నారన్నారు. టీజీఎస్ఆర్టీసీ కార్గో సర్వీసెస్ ఏర్పడినప్పటి నుండి ఆర్టీసీ హమాలి కార్మికులకు జీరో నుంచి 50 కిలోల బరువు వరకు పది రూపాయలను ఇచ్చేదని అన్నారు. ప్రభుత్వం హమాలీ కూలీరేట్లను 20 రూపాయలకు పెంచాలని, ప్రతి కార్మికుడికి రెండు జతల యూనిఫాం, హెల్త్ కార్డులు, రెస్ట్ రూమ్, ఉచిత బస్సు పాసులు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ ఆర్టీసీ కార్గో హమాలీ కార్మికులు రాములు, ఆంజనేయులు, గిరి,రవి, నరేష్, మూర్తి పాల్గొన్నారు.

Read Also: 50 సీట్లతో మెడికల్ కాలేజీ నడపడం బాధాకరం: మాజీ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>