కలం, వెబ్ డెస్క్: రాజ్యసభలో ఖాళీలు ఏర్పడిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నుంచి కీలక నేతలు రేసులో ఉన్నారు. ఈ క్రమంలో అభ్యర్థుల తుది ఎంపికపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర కసరత్తులు చేస్తోంది. తెలంగాణలో రెండు స్థానాలు ఖాళీగా ఉండగా, ఒక స్థానానికి అభిషేక్ సింఘ్వీకి దాదాపు ఖరారు కాగా, రెండో స్థానంపై కీలక చర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు (TPCC Chief) మహేశ్ కుమార్ గౌడ్ అభ్యర్థుల ఎంపికపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
‘‘నిన్న ఎయిర్ పోర్టులో రాహుల్‌తో జరిగిన భేటీలో రాజ్యసభ అభ్యర్థులపై క్లారిటీ రాలేదు. దీనిపై మరో సారి చర్చిస్తామని రాహుల్ అన్నారు. రేసులో ఎవరు ఉన్నారు అనేది ఇప్పుడే చెప్పలేం. అన్ని సమీకరణాలను బేరీజు వేసుకున్న తర్వాతే రాజ్యసభ అభ్యర్థులను (Rajya Sabha) ఏఐసీసీ ఖరారు చేస్తుంది’’ అని మహేశ్ కుమార్ గౌడ్ (TPCC Chief Mahesh Goud) తెలిపారు.
Read Also: సంక్షేమ పథకాలపై సీఎం రేవంత్ ఫోకస్.. అధికారులకు కీలక ఆదేశాలు
Follow Us On: Sharechat

