కలం, వెబ్ డెస్క్ : ఎమ్మెల్యే అరవ శ్రీధర్ (Arava Sridhar) వివాదం ఇప్పుడు న్యాయస్థానం గడపకు చేరింది. తనపై నమోదైన అక్రమ కేసులను కొట్టివేయాలని కోరుతూ బాధితురాలు హర్షవీణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా హర్షవీణ తరపు న్యాయవాదులు సాయిక్రిష్ణ, గల్లా సతీశ్ కోర్టులో కీలక వాదనలు వినిపించారు.
అధికార ముసుగులో ఎమ్మెల్యే తన హోదాను అడ్డం పెట్టుకుని ఒక మహిళను మోసం చేశారని, పైగా ఆమెపై తప్పుడు కేసులు పెట్టించి వేధిస్తున్నారని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. బాధితురాలిని ఇబ్బందులకు గురిచేసే ఉద్దేశంతోనే ఈ అక్రమ కేసులు బనాయించారని, తక్షణమే వాటిని కొట్టివేసి ఆమెకు న్యాయం చేయాలని వారు కోరారు.
Read Also: మహిళల పేరుతో రాజకీయం సిగ్గుచేటు : ట్రోల్స్‌పై రేణుక జెట్టి ధ్వజం
Follow Us On: Instagram

