తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో దారుణ హత్య

కలం, వెబ్ డెస్క్ : తూర్పుగోదావరి (East Godavari) జిల్లాలోని సీతానగరం(Sitanagaram)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను, అత్తను ఓ కిరాతక భర్త కత్తితో నరికి హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల సమాచారం ప్రకారం, కుటుంబ కలహాలే ఈ ఘాతుకానికి కారణమై ఉండవచ్చని అనుమానిస్తున్నారు. చిన్నచిన్న గొడవలు తీవ్ర స్థాయికి చేరుకుని చివరకు ఈ దారుణానికి దారి తీసినట్లు తెలుస్తుంది. ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు.

Read Also: ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న పవన్ కల్యాణ్

Follow Us On: Instagram

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>