epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

5 లక్షల కోట్ల స్కామ్ ఆరోపణలపై స్పందించిన మంత్రి ఉత్తమ్

రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హెచ్ఐఎల్‌టీ‌పై (HILT) ప్రతిపక్షాలు అర్థంలేని ఆరోపణలు చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) తీవ్రంగా విమర్శించారు. హైదరాబాద్ అభివృద్ధికి కీలకమైన ఈ పాలసీపై బీఆర్ఎస్, బీజేపీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.

ప్రతిపక్షాలు ఈ పాలసీ అసలు ఉద్దేశమేంటో చదవడం లేదన్నారు. పాలసీని అర్థం చేసుకోకుండానే ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. . ప్రభుత్వంపై బురద చల్లాలి కాబట్టి తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారు. హైదరాబాద్‌ ఢిల్లీలాగా కాలుష్య నగరంగా మారకూడదనేది మా లక్ష్యం. పరిశ్రమలు పర్యావరణ అనుమతులు, నియంత్రణలు, తప్పనిసరిగా పాటించేలా ఈ పాలసీ రూపొందించాం” అని తెలిపారు.

హైదరాబాద్‌లో పెరుగుతున్న జనాభా, రవాణా ఒత్తిడి, పారిశ్రామిక విస్తరణ వీటన్నింటని దృష్టిలో ఉంచుకుని హెచ్‌ఐఎల్‌టీ పాలసీ అవసరమైందని మంత్రి పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా దారుణమైనవన్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై అపోహలు సృష్టించడానికి మాత్రమే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని వారు విమర్శించారు. పరిశ్రమల ఏర్పాటులో పారదర్శకత, సమతుల అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ ఈ మూడు లక్ష్యాలకు ఈ పాలసీ బలం చేకూరుస్తుందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

కొత్తపాలసీ పేరుతో భారీ అవినీతికి తెరలేపారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. పరిశ్రమలకు తక్కువ ధరలకే భూములు ఇచ్చి లోపాయికారిక ఒప్పందం చేసుకున్నారన్నది బీఆర్ఎస్ ఆరోపణ. మొత్తం 5 లక్షల కోట్ల కుంభకోణం జరగబోతున్నదని కేటీఆర్ ఆరోపించారు. ఈ ఆరోపణలను మంత్రి ఉత్తమ్(Uttam Kumar Reddy) ఖండించారు.

Read Also: కాళోజీ వర్సిటీ ప్రొఫెసర్‌పై లైంగిక ఆరోపణలు

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>