epaper
Sunday, March 1, 2026
epaper

‘ది కేరళ స్టోరీ 2’ మూవీ మేకర్స్​కు గుడ్​ న్యూస్​

కలం, వెబ్​ డెస్క్​: ది కేరళ స్టోరీ 2 సినిమా మేకర్స్​కు గుడ్​ న్యూస్​(The Kerala Story 2). ఈ మూవీ విడుదలపై ఉన్న తాత్కాలిక స్టేను కోర్టు ఎత్తివేసింది. దీంతో ఈ చిత్రం విడుదలకు రూట్​ క్లియరైంది. ఫిబ్రవరి 27 రిలీజ్​ కావాల్సిన ఈ చిత్రం ఆగిపోగా, ప్రస్తుత తీర్పుతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

కేరళను తప్పుగా చిత్రీకరించారని.. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఈ సినిమాలో డైలాగులు, సన్నివేశాలు ఉన్నాయని పిటిషన్​ దాఖలైన సంగతి తెలిసిందే. దీనిపై జస్టిస్​ బి.కురియన్​ జోసెఫ్​ సారథ్యంలోని సింగిల్​ జడ్జి బెంచ్​ గురువారం తీర్పు చెబుతూ.. సీబీఎఫ్​సీ తీరును తప్పుపట్టింది. అలాగే సినిమా విడుదలపై రెండు వారాల పాటు తాత్కాలిక స్టే విధించింది.దీనిపై అదే రోజు సినిమా నిర్మాతలు డివిజన్​ బెంబ్​ను ఆశ్రయించారు.

ఈ క్రమంలో జస్టిస్ ఎస్​ఏ ధర్మాధికారి, జస్టిస్​ పీవీ బాలకృష్ణన్​ నేతృత్వంలోని డివిజన్​ బెంచ్​ విచారణ జరిపి, తీర్పును రిజర్వ్​ చేసింది. శుక్రవారం తీర్పు ప్రకటించింది. సింగిల్​ బెంచ్ ఇచ్చిన స్టేను రద్దు చేసింది. ఈ సందర్భంగా ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. సీబీఎఫ్​సీ అన్ని అంశాలూ పరిశీలించిన తర్వాతే సర్టిఫికెట్​ ఇచ్చిందని, ఒకవేళ మూవీ కారణంగా సమస్యలు తలెత్తితే.. వాటిని పరిష్కరించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది.

కాగా, బలవంతపు మతమార్పిడిలు, లవ్​ జిహాద్​ వంటి అంశాలతో సుదీప్తో సేన్​ దర్శకత్వంలో వచ్చిన ‘ది కేరళ స్టోరీ’ మొదటి భాగం సైతం తొలుత ఇలాగే వివాదాల్లో చిక్కుకుంది. అనంతరం అడ్డంకులు పూర్తి చేసుకొని బాక్సాఫీస్​ వద్ద మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో దీనికి కొనసాగింపుగా నిర్మించిన చిత్రమే ‘ది కేరళ స్టోరీ 2’(The Kerala Story 2).

లవ్​ జిహాద్​, మత మార్పిడిల సమస్యలను ఎదుర్కొన్న కొన్ని నిజ జీవిత సంఘటనలను ఇందులో చూపించినట్లు నిర్మాత విపుల్​ అమృత్​లాల్​ షా, దర్శకుడు కామాఖ్య నారాయణ సింగ్​ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు. అనంతరం మూవీ ట్రైలర్​ రిలీజ్​ అయ్యింది. ఆ వెంటనే దీనిపై కేరళ హైకోర్టులో పిటిషన్​ దాఖలైంది. ఈ క్రమంలో అడ్డంకులన్నీ తొలగడంతో త్వరలోనే ఈ సినిమాను విడుదల చేసేందుకు నిర్మాతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

Read Also :  శుభ్‌మన్ గిల్ నుంచి ఎంతో నేర్చుకున్నా

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!