Mobile Popup Ad
Mobile Popup Ad

కవిత ఇంటి వద్ద ఉద్రిక్తత.. ఎన్డీటీవీ రిపోర్టర్‌పై దాడి

కలం, వెబ్ డెస్క్: జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత (Kavitha) ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. వార్తా కవరేజ్ కోసం వెళ్లిన ఆశిష్ పాండే, ఎన్డీటీవీకి చెందిన జర్నలిస్టుపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం. ప్రాథమిక సమాచారం ప్రకారం, కవిత నివాసం వద్ద జరుగుతున్న పరిణామాలను చిత్రీకరించేందుకు ఆశిష్ పాండే వెళ్లగా, అక్కడ ఉన్న కొందరు వ్యక్తులతో వాగ్వాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ ఘటనలో రిపోర్టర్‌కు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. అధికారికంగా ఇంకా పూర్తి వివరాలు వెల్లడికాలేదు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు సమాచారం సేకరిస్తున్నట్లు తెలిసింది. దాడి చేసిన వారు ఎవరు? దాడికి కారణం ఏమిటి అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. జర్నలిస్టు సంఘాలు ఈ ఘటనపై స్పందించే అవకాశం ఉంది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది.

Read Also :  టీవీకే చీఫ్​ విజయ్​కి మరో షాక్​

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>