epaper
Friday, January 16, 2026
spot_img
epaper

పెళ్లి పేరుతో ఘరానా మోసం.. అరెస్ట్ చేసిన పోలీసులు

భువనగిరిలో ఓ నిత్య పెళ్లికొడుకు(Eternal Groom) బండారం బయటపడింది. డబ్బు కోసం మహిళలను పెళ్లి పేరుతో మోసం చేస్తున్న సురేంద్ర అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు భువనగిరి టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ రమేశ్‌కుమార్‌ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన సోమవరపు సురేంద్ర తనకు మైనింగ్‌ వ్యాపారం, పెట్రోల్‌బంక్‌, కన్సల్టెన్సీ సంస్థలు ఉన్నాయని చెబుతూ మహిళలను మోసం చేసేవాడు. మొదట మహిళలను తన మాటలతో నమ్మించేవాడు. ఆ తర్వాత పెళ్లి చేసుకుని.. వాళ్ల దగ్గర ఉన్న డబ్బు, బంగారాన్ని కాజేసేవాడని తమ దర్యాప్తులో తేలినట్లు పోలీసులు తెలిపారు.

క్రిస్టియన్‌ మ్యాట్రిమోనీ ద్వారా పరిచయమైన ఒక మహిళను పెళ్లి చేసుకున్న సురేంద్ర.. ఆమె వద్ద నుంచి రూ.15 లక్షలు నగదు, 30 తులాల బంగారు ఆభరణాలను తీసుకుని పరారయ్యాడు. అంతకుముందు మరొక మహిళను పెళ్లి చేసుకుని ఆమె దగ్గర రూ.12 లక్షలు తీసుకుని జంప్ అయ్యాడు. ఆ తర్వాత ఆమెకు రూ.7 లక్షలు తిరిగి ఇచ్చి రాజీ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

అలాగే శైలజ అనే మహిళ వద్ద నుంచి కూడా పెళ్లి పేరుతో రూ.2.50 లక్షలు దోచుకున్నాడు. విజయవాడకు చెందిన రత్నకుమారిని వివాహం చేసుకుని రూ.2 లక్షలు ఇచ్చి వదిలించుకున్నాడని విచారణలో బయటపడింది.

Eternal Groom | తాజాగా, ఓ మహిళ తనను పెళ్లి చేసిన తర్వాత ఇంటికి తీసుకెళ్లకుండా నిరంతరం డబ్బులు అడిగి వేధిస్తున్నాడని బాధితురాలు ఆగస్టు 6న ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అరెస్ట్‌ చేసి కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి రిమాండ్‌కు పంపారు. ఇంకా, 2017లో కరీంనగర్‌కు చెందిన మహిళను వివాహం చేసుకుని, 2020లో విడాకులు ఇచ్చిన విషయం కూడా విచారణలో బహిర్గతమైందని ఇన్‌స్పెక్టర్‌ రమేశ్ కుమార్ తెలిపారు.

Read Also: మాదాపూర్‌లో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ

Follow Us on: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>