కలం, వెబ్ డెస్క్ : యూజీసీ (UGC) నిబంధనలను అమలు చేయాలన్న ప్రధాన డిమాండ్‌తో జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (Jawaharlal Nehru University) విద్యార్థి సంఘం చేపట్టిన నిరసన కార్యక్రమాలు ఉద్రిక్తతకు దారితీశాయి. క్యాంపస్ నుండి కేంద్ర విద్యాశాఖ మంత్రిత్వ శాఖ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించాలని విద్యార్థులు పిలుపునిచ్చారు. అయితే యూనివర్సిటీ పరిపాలన విభాగం ఈ మార్చ్‌కు అనుమతి నిరాకరించడంతో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగారు.
విద్యార్థులు క్యాంపస్ దాటి బయటకు రాకుండా పోలీసులు ప్రధాన ద్వారాల వద్ద భారీగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో విద్యార్థులు ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారడంతో పలువురు పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయి. శాంతిభద్రతలను అదుపులోకి తెచ్చే క్రమంలో ఢిల్లీ పోలీసులు రంగంలోకి దిగి సుమారు 50 మందికి పైగా నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం క్యాంపస్ (Jawaharlal Nehru University) అంతటా భారీగా పోలీసు బలగాలను మోహరించారు. అధికారులు అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. విద్యార్థుల ఆందోళనతో విశ్వవిద్యాలయ వాతావరణం ప్రస్తుతం ఉద్రిక్తంగా మారింది.
Read Also: టార్గెట్ హరీశ్ రావు.. సిద్దిపేటలో కవిత మరో కీలక అడుగు
Follow Us On: X(Twitter)

