Mobile Popup Ad
Mobile Popup Ad

మా రిసెప్ష‌న్‌కు రండి.. అమిత్ షాకు ర‌ష్మిక‌, విజ‌య్ ఆహ్వానం

క‌లం, వెబ్ డెస్క్‌: టాలీవుడ్ సూప‌ర్ స్టార్స్ ర‌ష్మిక మంద‌న్నా (Rashmika Mandanna), విజ‌య్ దేవ‌ర‌కొండ (Vijay Deverakonda)ల వివాహం గురువారం ఉద‌య్‌పూర్‌లోని ఓ ప్యాలెస్‌లో అంగ‌రంగ వైభ‌వంగా జరిగింది. ఇక మార్చి 4న హైద‌రాబాద్‌లో రిసెప్ష‌న్‌కు ఏర్పాట్లు ముమ్మ‌రంగా జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఉద‌య్‌పూర్‌లో కుటుంబ‌స‌భ్యులు, స‌న్నిహితుల మ‌ధ్య వివాహం చేసుకున్న ఈ జంట హైద‌రాబాద్‌లోని ఓ పెద్ద హోట‌ల్‌లో టాలీవుడ్, రాజ‌కీయ ప్ర‌ముఖుల‌కు విందు ఇవ్వ‌నున్నారు. దీని కోసం ఇప్ప‌టికే ప్ర‌ముఖులంద‌రికీ ఇన్విటేష‌న్లు పంపించేశారు.

తాజాగా కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా (Amit Shah)ను ర‌ష్మిక, విజ‌య్ ప్ర‌త్యేకంగా క‌లిశారు. హైద‌రాబాద్‌లో జ‌రుగ‌నున్న త‌మ రిసెప్ష‌న్ విందుకు హాజ‌రు కావాల‌ని కోరారు. అమిత్‌షాకు ఓ వెండి వినాయ‌కుడి ప్ర‌తిమ‌ను అందించి ఆహ్వానించారు. ఈ ఫోటోలు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. ఇప్ప‌టికే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మ‌హేశ్ కుమార్‌గౌడ్‌ల‌కు కూడా ఆహ్వానం అందింది. మ‌రోవైపు వీళ్ల పెళ్లి ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అయిపోయాయి. మిలియ‌న్ల‌లో లైకులు, షేర్ల‌తో వెలిగిపోతున్నాయి. ఈ కొత్త జంట‌కు (Rashmika – Vijay) సోష‌ల్ మీడియా వేదిక‌గా ప్ర‌ముఖులు, అభిమానుల నుంచి విషెస్ వెల్లువెత్తుతున్నాయి.

Read Also: కుమ్మెర ఘటన.. రేణూ దేశాయ్ పై ట్రోల్స్.. ఎందుకు..?

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>